ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తో సినిమాలు చేసినా.. సౌత్ స్టార్ హీరోయిన్స్ తో ప్రభాస్ నటించినా కూడా ఆయన అభిమానులు ఎక్కువగా కోరుకునేది మాత్రం అనుష్క కాంబోలో ప్రభాస్ సినిమా. ఔను ఇప్పటికే ప్రభాస్ మరియు అనుష్క కాంబోలో మిర్చి.. బిల్లా మరియు బాహుబలి సినిమా లు వచ్చాయి. బాహుబలి 2 విడుదల అయినప్పటి నుండి మళ్లీ వీరిద్దరి కాంబో మూవీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అనుష్క హీరోయిన్ గా ఈమద్య కాలంలో సినిమాలు చాలా తక్కువ చేస్తోంది. నిశ్శబ్దం సినిమా తర్వాత ఈమె మళ్లీ సినిమాలేమి మొదలు పెట్టలేదు. ఇటీవలే యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమాను ఈ అమ్మడు కమిట్ అయ్యింది. ఆ సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ఈ అమ్మడు ప్రభాస్ తో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
చాలా రోజుల తర్వాత ప్రభాస్ మరియు అనుష్క కలిసి నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాజా డీలక్స్ అనే సినిమా పట్టాలెక్కబోతుంది. పక్కా కమర్షియల్ సినిమా విడుదల అయిన వెంటనే ప్రభాస్ తో సినిమాకు మారుతి రెడీ అవ్వబోతున్నాడట.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కొంత మేరకు అయ్యిందని తెలుస్తోంది. ప్రభాస్ తో మారుతి చేయబోతున్న సినిమాకు గాను ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నారు అనేది సమాచారం. గత కొన్నాళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముగ్గురు హీరోయిన్స్ లో అనుష్క ఒక హీరోయిన్ గా కనిపించబోతుందట.
మారుతి సన్నిహితుల నుండి తాజాగా ఆ విషయం క్లారిటీ వచ్చింది. రాజా డీలక్స్ కోసం అనుష్క ను అడిగామని.. ఆమె కూడా ప్రభాస్ తో సినిమాకు రెడీ అయ్యిందంటూ వారు చెప్పుకొచ్చారు. అనుష్క మరియు ప్రభాస్ ల కాంబోలో సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు మారుతి అతి త్వరలోనే అధికారికంగా గుడ్ న్యూస్ ను చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజా డీలక్స్ గురించిన వార్తలు గత కొన్ని రోజులుగా జోరుగా వస్తున్నాయి. ఇప్పటి వరకు మారుతి మాత్రం కేవలం ప్రభాస్ తో చర్చలు జరిగాయి.. త్వరలోనే ఆయన తో బుజ్జిగాడు.. డార్లింగ్ వంటి సినిమా చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.