కంటెంట్ గొప్పతనం అంటున్నాడు మారుతి

Update: 2016-12-29 13:30 GMT
'భలే భలే మగాడివోయ్' అంటూ అల్లు అరవింద్ తీసిన సినిమా ఏ రేంజులో హిట్టయ్యిందో తెలిసిందే. మారుతి రాసిన కంటెంట్.. హీరో నాని యాక్టింగ్.. లావణ్య త్రిపాఠి అభినయం.. ప్రాపర్ రిలీజ్ ప్లానింగ్.. ఆ సినిమాను 25 కోట్ల రూపాయల బ్లాక్ బస్టర్ చేసేశాయి. ఆ తరువాత ఆ రేంజు హిట్టును అందుకోవడం ఇంకా మారుతి అండ్ నాని కి కూడా సాధ్యపడలేదు.

అయితే తెలుగులో హిట్టయిన ఈ సినిమాను.. కన్నడలో కూడా రీమేక్ చేశారు అల్లు అరవింద్. అక్కడి లోకల్ ప్రొడ్యూసర్ తో కలసి రీమేక్ చేసిన ఈ సినిమాను.. తెలుగు సినిమా ''దృవ'' కోసం పోస్టుపోన్ చేసి.. మొన్న 23న రిలీజ్ చేశారులే. అక్కడ కూడా సినిమాకు హిట్ టాకే వచ్చింది. ఇప్పుడు కలక్షన్లను చూస్తుంటే బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా కంటెంట్ కే ఇవ్వాలి అంటున్నాడు దర్శకుడు మారుతి.

మొన్న తమిళంలో ప్రేమ కథా చిత్రమ్.. ఇప్పుడు కన్నడలో భలే భలే మగాడివోయ్.. ఈ రెండు సినిమాలు కూడా హిట్టవ్వడానికి ఆ సినిమాలోని కంటెంట్ ఒక్కటే అసలు కారణం అని మారుతి ఈ సందర్భంగా ఆనందం వ్యక్తపరుస్తూ చెప్పాడు. మరి మారుతి ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను మరిన్నిచేసి.. ఇతర బాషల్లోకి రీమేక్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుందాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News