మార్వెల్ సాంగ్: రెహమాన్ మేజిక్ ఉందా ?

Update: 2019-04-02 06:51 GMT
అంటే అభిమానులకు కోపం వస్తుందేమో కానీ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ తన స్థాయి మేజిక్ కోల్పోయి చాలా కాలమయ్యింది. ఒకప్పుడు కేవలం తన పేరు మీద లక్షల సంఖ్యలో ఆడియో క్యాసెట్లు సేల్ అయ్యే రేంజ్ నుంచి ఈ సినిమాకు కంపోజ్ చేసింది రెహమానా అని సందేహపడే దాకా వచ్చాడు. ఇది ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కైనా కెరీర్ లో వచ్చే ఫేజ్ కాని రెహమాన్ కున్న ఫాలోయింగ్ దృష్ట్యా ఎప్పటికైనా బలమైన కంబ్యాక్ ఇవ్వకపోతాడా అనే అంచనాలో ఉన్నారు ఫ్యాన్స్.

ఈ నేపధ్యంలో రెహమాన్ హాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీ అవెంజెర్స్ ఎండ్ గేమ్ కోసం ప్రత్యేకంగా కంపోజ్ చేసిన మార్వెల్ యాంతం ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. రిలీజ్ చేసిన ఇరవై నాలుగు గంటలు దాటకుండానే మిలియన్ వ్యూస్ దాటేసిన ఈ వీడియో సాంగ్ ఇప్పుడు యుట్యూబ్ లెక్కల్లో టాప్ 3 ట్రెండింగ్ లో ఉంది. దీన్ని బట్టి అవెంజర్స్ మీద రెహమాన్ కాంబినేషన్ మీద పబ్లిక్ కు అంత అంచనాలు ఉన్నాయో అర్థమవుతోంది

అయితే రెహమాన్ ఈ పాటతో అంచనాలు పూర్తిగా అందుకున్నాడా అంటే సమాధానం సగమే అని చెప్పక తప్పదు. మంచి బీట్ క్యాచీగా అనిపిస్తున్న ట్యూన్ ఉన్నప్పటికీ ఈ సిరీస్ లో చివరి భాగం సినిమా కాబట్టి ఫ్యాన్స్ దీన్నుంచి చాలా ఆశిస్తున్నారు. వందేమాతరం  తరహలో  శాశ్వతంగా అలా నిలిచిపోవాలనే స్థాయిలో చాలా ఎక్స్ పెక్ట్ చేశారు. మరీ నిరాశ పరచలేదు కానీ జస్ట్ ఓకే అనిపించుకునేలా మెల్లగా వైరల్ అయ్యేలా కనిపిస్తోంది. రొకే నా రుకెంగే అబ్ తో యారా అంటూ సూపర్ హీరోస్ మధ్య స్నేహాన్ని హై లైట్ చేస్తూ నిబ్బరాన్ని కోల్పోకుండా తానొస్ ని అంతం చేయమని స్ఫూర్తినిచ్చేలా దీన్ని బాగానే ట్యూన్ చేసాడు. గతంలో వచ్చిన రెహమాన్ ప్రైవేట్ ఆల్బమ్స్ తో పోల్చుకోకుండా వింటే మార్వెల్ యాంతం ఓ మోస్తరుగా పాస్ అయ్యేలాగే ఉంది.


Full View

Tags:    

Similar News