ఖాన్‌ ల‌ను కొట్టేసే సూప‌ర్‌ హీరో?

Update: 2019-01-30 05:37 GMT
బాలీవుడ్ ని ద‌శాబ్ధాల పాటు ఏల్తున్న ఖాన్ ల గ్రాఫ్ అంత‌కంత‌కు ప‌డిపోతుంటే .. కెన‌డా, అమెరికాలో శృంగార తార‌గా రాజ్య‌మేలి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించుకున్న స‌న్నీలియోన్ గ్రాఫ్ అంత‌కంత‌కు పెరుగుతోంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. కింగ్ ఖాన్, అమీర్ ఖాన్ అంత‌టివారు స‌క్సెస్ ముఖం చాటేసి నానా తంటాలు ప‌డుతుంటే, స‌న్నీ మాత్రం స‌క్సెస్ తో ప‌నే లేకుండా ఏకంగా హాలీవుడ్ దృష్టిలో ప‌డింది. ప్ర‌ఖ్యాత మార్వ‌ల్ సంస్థ స‌న్నీలియోన్‌ ని సూప‌ర్ హీరోగా ప‌రిచ‌యం చేసేందుకు ఉత్సాహం చూపించ‌డం చూస్తుంటే.. అస‌లు ఈ శృంగార తార స్కైని ట‌చ్ చేస్తోందా? అనిపించ‌క మాన‌దు.

గ‌త ఏడాది మార్వ‌ల్ సంస్థ నుంచి రిలీజైన `అవెంజ‌ర్స్- ఇన్‌ఫినిటీ వార్` సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద అప్ప‌టివ‌ర‌కూ ఉన్న అన్ని రికార్డుల్ని చెరిపేసింది. భార‌త‌దేశంలోనూ నంబ‌ర్ 1 వ‌సూళ్ల సినిమాగా రికార్డుల కెక్కింది. ఈ విష‌యాన్ని మార్వ‌ల్ స్టూడియోస్  ప్ర‌తినిధి కెవిన్ ఫీజ్ ఓ ఇంట‌ర్వ్యూలోనూ ప్ర‌స్థావించారు. ఆ క్ర‌మంలోనే మార్వ‌ల్ తెర‌కెక్కించనున్న త‌ర్వాతి సినిమా `అవెంజ‌ర్స్ - ది ఎండ్ గేమ్`కి ఓ ఇండియ‌న్ సూప‌ర్ హీరో అవ‌స‌రం అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

తాజాగా.. మార్వ‌ల్ యూనివ‌ర్స్ సంస్థ.... ఫిక్ష‌న‌ల్ కామిక్ క్యారెక్ట‌ర్ మిస్ క‌మ‌లా ఖాన్ (ముస్లిమ్  సూప‌ర్ హీరో) పాత్ర‌లో ఒక ఇండియ‌న్ హీరో న‌టించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు మార్వ‌ల్ నుంచి ప్ర‌క‌ట‌న సిద్ధ‌మైంది. మార్వ‌ల్ దృష్టి అనూహ్యంగా స‌న్నీపై ప‌డింద‌ని సంకేతం అందుతోంది. భార‌త‌దేశం నుంచి సూప‌ర్ హీరో పాత్ర‌కు స‌న్నీలియోన్ వ‌న్నె తెస్తుంద‌ని స‌ద‌రు సంస్థ భావిస్తోందిట‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే  ఖాన్ ల‌కు స‌న్నీలియోన్ థ్రెట్ అనే చెప్పాలి. స‌న్నీ ఒక అతి పెద్ద ఫ్రాంఛైజీ నాయిక‌గా ఇండియన్ మార్కెట్లో స్కైని ట‌చ్ చేస్తుంది. మార్వ‌ల్ సంస్థ స‌న్నాహ‌కం చూస్తుంటే శృంగార తార‌కు ఛాన్సులివ్వ‌ని ఖాన్ లకు కౌంట‌ర్ స్టార్ట‌యిన‌ట్టేన‌ని అర్థ‌మ‌వుతోంది. ఇండియ‌న్ సూప‌ర్ హీరో గా మార్వ‌ల్ మూవీలో న‌టిస్తే స‌న్నీ ఖాన్ ల కంటే పెద్ద స్టార్ అయిన‌ట్టే..!! అన్న విశ్లేష‌ణ వెలువ‌డుతోంది. మార్వ‌ల్ కామిక్స్ ష‌ర్ట్ తొడుక్కుని స‌న్నీ ఇచ్చిన ఫోజు చూస్తుంటే ఒక అభిమానిగా ఆ ఛాన్స్ దక్క‌నుంద‌నే అర్థ‌మ‌వుతోంది.


Tags:    

Similar News