మాస్ మహారాజా రవితేజ హీరోగా మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయతి హీరోయిన్ లుగా నటించిన చిత్రం ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. దీపావళి సందర్బంగా ఈ సినిమా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అవ్వడంతో పాటు మాస్ రాజా టైటిల్ సాంగ్ అవ్వడం వల్ల మాంచి మాస్ బీట్ ఉంటుందని అభిమానులు మొదటి నుండే ఆశించారు. అంతా భావించినట్లుగానే ఖిలాడి టైటిల్ సాంగ్ మంచి మాస్ బీట్స్ తో సాగింది. రవితేజ మార్క్ మానరిజంతో పాటు ఆకట్టుకునే విజువల్స్ తో ఈ పాట సాగుతుందని లిరికల్ వీడియోలో చూపించారు. రవితేజను చాలా రోజుల తర్వాత మళ్లీ పూర్తి ఫామ్ లోకి వచ్చినట్లుగా ఈ సినిమాతో చూడబోతున్నాం అంటూ ఈ పాటను చూస్తుంటే అనిపిస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈమద్య కాలంలో మంచి మాస్ సాంగ్స్ ను పాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రామ్ మిర్యాల ఈ పాటను పాడటం వల్ల పాట రేంజ్ మరింతగా పెరిగిందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. శ్రీ మణి సాహిత్యం అందించిన ఈ పాట సినిమాలో హీరో పాత్రను తెలియజేసేలా ఉంది. ఆకట్టుకునే మాస్ ఎలిమెంట్స్ తో దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. రాక్షసుడు సినిమా తర్వాత రమేష్ వర్మ ఫామ్ లోకి వచ్చాడు. ఆ ఊపుతో ఈ సినిమాను తెరకెక్కించాడు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కు బాగా సెట్ అయ్యే మంచి కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా రమేష్ వర్మ చెబుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాను భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
రవితేజ ఖిలాడి సినిమా మాత్రమే కాకుండా మరో వైపు రామారావు ఆన్ డ్యూటీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఇక త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే సినిమాను కూడా ఈయన చేయాల్సి ఉంది. ఇటీవలే ఆ సినిమా ప్రకటన వచ్చింది. త్వరలోనే ధమాకా మొదలు అవ్వబోతుంది. ఈ రెండు సినిమాలు కాకుండా దీపావళి సందర్బంగా టైగర్ నాగేశ్వరరావు సినిమాను రవితేజ ప్రకటించాడు. ఖిలాడి సినిమాను ఈ ఏడాది విడుదల చేస్తే మిగిలిన మూడు సినిమాలతో రవితేజ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాలుగు కూడా నాలుగు విభిన్నమైన కాన్సెప్ట్ లు నేపథ్యాలతో రూపొందుతున్న సినిమాలు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రవితేజ మళ్లీ ఈ సినిమాలతో ఫుల్ స్వింగ్ లోకి వచ్చినట్లే అంటున్నారు.
Full View