మాస్ మహారాజా రవితేజ కెరీర్ ఆరంభం నుంచి మాస్ జానర్ కి పరిమితమై కెరీర్ సాగించిన సంగతి తెలిసిందే. మై ఆటోగ్రాఫ్ లాంటి ప్రయోగం చేసినా కానీ సక్సెస్ కాకపోవడంతో అతడి లెక్క మారింది. కమర్శియల్ గా సినిమా రాణించాలంటే మాస్ ఇమేజ్ ని చెక్కు చెదరకుండా ఇన్నేళ్ల పాటు జాగ్రత్త పడాలని ఫిక్సయ్యారు. అయితే ఒకానొక దశలో అదే ఇమేజ్ రాజా కి డ్యామేజ్ గా మారింది. ఒకే జానర్ సినిమాల్లో తరుచూ నటించడంతో ప్రేక్షకులకు ముఖం మొత్తేసింది. దీంతో రవితేజ కు కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఆయన అభిమానులే రాజా గేర్ మార్చాలంటూ బాహాటంగానే విమర్శించిన సందర్భాలున్నాయి. దీంతో మాస్ మహారాజా ఆ జానర్ నుంచి బయటపడేందుకు ఓ చిన్న ప్రయత్నం చేసాడు.
కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. `డిస్కోరాజా` లాంటి సినిమాతో మాస్ ఇమేజ్ ని బ్యాలెన్స్ చేద్దామని చూసినా మొదటికే మోసం వచ్చేలా ఉందని అసలు విషయాన్ని గ్రహించారు. ఆ వెంటనే గోపీచంద్ మలినేని తో `క్రాక్` సినిమా చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడులో జరిగిన ఓ చిన్న వాస్తవ సంఘటనని ఆధారంగా చేసుకుని రవితేజ మాస్ ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించి సక్సెస్ అందుకుంది ఆ ద్వయం. ఈ సక్సెస్ తో రాజా మళ్లీ పట్టాలెక్కాడు. దీంతో రవితేజ మళ్లీ పాత జోనర్లోనే పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన చేస్తోన్న సినిమాల లైనప్ చూస్తే అలాగే అనిపిస్తోంది.
రమేష్ వర్మ దర్శకత్వంలో ప్రస్తుతం `ఖిలాడీ` అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. ఇది పక్కా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. రవితేజ మార్క్ చిత్రమిదని పబ్లిక్ లో టాక్ నడుస్తోంది. దీంతో పాటు ` రామారావు ఆన్ డ్యూటీ` అనే మరో చిత్రాన్ని రవితేజ సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. శరత్ మండవ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాల్ని బట్టి ఇది కూడా తన ఇమేజ్ కి తగ్గట్టే పక్కా మాస్ యాక్షన్ చిత్రమని తేలిపోయింది.
ఇటీవలే `ధమాకా` అంటూ మాస్ లోకి దూసుకుపోయే టైటిల్ ని రవితేజ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఇది మాస్ చిత్రమని మేకర్ ని బట్టి ముందే ఊహించొచ్చు. త్రినాథరావు గతంలో తెరకెక్కించిన `సినిమా చూపిస్త మావ`...`నేను లోకల్` చిత్రాలు ఓ వర్గం ప్రేక్షకుల్ని మాత్రమే అలరించిన సంగతి తెలిసిందే. మాస్ కమర్శియల్ కంటెంట్ తో తెరకెక్కిన చిత్రాలు ఆ రెండూ. ఈ నేపథ్యంలో మాస్ రాజాతో అంతకు మించి కొత్త పాయింట్ ఆశించవచ్చా? అన్న సందేహం రాక మానదు. అయితే మాస్ పాత్రల్లోనూ కొత్త తరహా ఆహార్యంతో రాజా కొంతవరకూ పాత వాసనలు రాకుండా కవర్ చేసే ఛాన్సుంటుందని కూడా అభిమానులు ఊహిస్తున్నారు.
`టైగర్ నాగేశ్వరరావు` బయోపిక్ ఎప్పుడు?
మాస్ మహారాజా రవితేజ `క్రాక్` గ్రాండ్ సక్సెస్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఖిలాడీ.. రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలపై మంచి బజ్ ఉంది. అయితే ఈ రెండిటితో బిజీగా ఉండగానే మాస్ రాజా మరో చిత్రాన్ని కూడా పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఏకంగా పాన్ ఇండియా రేంజులో సినిమా చేయాలని కంకణం కట్టుకున్నాడని తెలుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గురించి గత రెండేళ్లుగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ కథ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ .. రానా వంటి వారిని సంప్రదించారు. చివరికి రవితేజ వద్దకు వచ్చింది. వంశీకృష్ణ స్క్రిప్ట్ పై కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు. చివరిగా రవితేజతో లాక్ అయినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే ఉన్నట్లు తెలుస్తోంది.
స్టూవర్ట్ పురం దొంగ అయిన క్రిమినల్ టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. దీనికి కమర్శియల్ అంశాలు జోడించి మాస్ రాజా ఇమేజ్ కు ఎంత మాత్రం తగ్గకుండా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని కథనాలొచ్చాయి. ఈ యాక్షన్ డ్రామాను అభిషేక్ అగర్వాల్ అత్యంత భారీ బడ్జెట్ తో బహుభాషల్లో నిర్మించనున్నారు. బయోపిక్ కేటగిరీ అనగానే రొటీనిటీకి భిన్నంగా మాస్ రాజా తనని ఆవిష్కరించుకునే ఛాన్సుంది.