మాస్ రాజా రూట్ మార్చుతున్నాడా?

Update: 2022-08-27 14:30 GMT
మాస్ రాజా మ‌ళ్లీ ప‌రాజయాల ప‌రంప‌రం కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. 'క్రాక్' తో ట్రాక్ లోకి వ‌చ్చాడ‌నుకున్న హీరో మ‌ళ్లీ ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకున్నారు. 'ఖిలాడీ'..'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాలు కోలుకోలేని దెబ్బ తీసాయి. దీంతో మ‌ళ్లీ పాత జాన‌ర్ లోకే జారుకుంటున్నాడ‌ని తెర‌పైకి వ‌స్తుంది. ఛాన్స్ ల ప‌రంగా ఢోకా లేకుండా వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నా? స‌క్సెస్ కి దూర‌మ‌వ్వ‌డంతో అస‌లు రాజా కెరీర్ లో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని క‌న్ ప్యూజ‌న్ ఏర్ప‌డుతుంది.

ప్ర‌స్తుతం 'ధ‌మాకా'..'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'..'రావ‌ణ‌సుర' చిత్రాల్లో న‌టిస్తున్నాడు.   టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ని కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కిస్తుండ‌గా.మిగ‌తా రెండు చిత్రాలు పూర్తి క‌ల్పిత క‌థ‌లే. అయితే వాటి జోన‌ర్ ఏంట‌న్న‌ది ఇంకా క్లారిటీ లేదు. మ‌రి తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో  మాస్ రాజా కొత్త ప్ర‌యోగాల‌కు పూనుకుంటున్నాడా? అంటే అవున‌నే వినిపిస్తుంది.

ఇటీవ‌లే యంగ్ మేక‌ర్ కం సినిమాటోగ్రాఫ‌ర్ కార్తికే ఘ‌ట్ట‌మ‌నేని తో 'ఈగిల్' అనే సినిమా చేస్తున్న‌ట్లు తెర‌పైకి వ‌చ్చిన‌ సంగ‌తి తెలిసిందే. టైటిల్ భిన్నంగా ఉండ‌టంతోనే ఇదేదో డిఫ‌రెంట్ అటెంప్ట్ అని తెలుస్తోంది. అయితే తాజాగా అదే నిజ‌మ‌ని బ‌ల‌మైన ప్ర‌చారం ఒక‌టి తెర‌పైకి వ‌స్తుంది. అంతీద్రీయ శ‌క్తులున్న‌ అంశాల‌తో కూడుకున్న చిత్ర‌మ‌ని స‌మాచారం.

అదే నిజ‌మైతే రాజా కెరీర్ కి రొటీన్ కి భిన్న‌మైన సినిమాగానే చెప్పాలి. ఇలాంటి జానర్ సినిమాలు తెలుగులో చాలా రేర్.  కొద్ది మంది హీరోలు మాత్ర‌మే ఇలాంటి ప్ర‌యోగాలు చేసారు. చిరంజీవి..వెంక‌టేష్‌...బాల‌కృష్ణ‌..నాగార్జున లాంటి హీరోలు మాత్ర‌మే పాక్షికంగా  ఈజానర్ ని ట‌చ్ చేసారు. ప్ర‌స్తుతం  బాలీవుడ్..హాలీవుడ్ లో మాత్రం త‌రుచుగా ఈ జాన‌ర్ సినిమాలొస్తున్నాయి.

క్రిష్.. రావన్ లాంటి సినిమాలతో అతీంద్రియ శక్తులున్న మనుషులను భారతీయ ప్రేక్షకులకు  పరిచయం చేసింది బాలీవుడ్  ద‌ర్శ‌క‌-నిర్మాతలే.  ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్ర్త తో ర‌ణ‌బీర్ క‌పూర్ లాంటి సాహ‌సానికి పూనుకున్నారు. హాలీవుడ్లో రెగ్యులర్గా వచ్చే సూపర్మేన్ ..

స్పైడర్ మేన్.. బ్యాట్ మేన్ లాంటి సూపర్ హీరోలు ఇటీవల కాలంలో ఇండియన్ స్క్రీన్ మీద కూడా సందడి చేస్తున్నారు. భారీ మార్కెట్ స్టామినా ఉన్న స్టార్ హీరోలతో బిగ్ బడ్జెట్ తో ఇలాంటి సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు మేకర్స్. ఆ కోవ‌లోకి ఇంకా తెలుగు ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు పూర్తి స్థాయిలో చేర‌లేదు. ఇప్పుడిప్పుడే ట్రెండ్ మారుతుంది. కాబ‌ట్టి  కంటెంట్ ప‌రంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
Tags:    

Similar News