మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా సంక్రాంతి పండుగ సందర్బంగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తో ముందుకు వెళుతోంది. జనవరి 9న విడుదలైన ఈ మాస్ పోలీస్ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయిందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా మేకర్స్ రిలీజ్ కి ముందే సోషల్ మీడియా వేదికగా అన్ని రకాల ప్రమోషన్స్ తో ప్రేక్షకులలో ఆసక్తి పెంచేసారు. అటు పాటలపరంగా ఇటు థియేట్రికల్ ట్రైలర్ పరంగా క్రాక్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది. అయితే సినిమా థియేటర్లలో యాభై శాతం సీటింగ్ అనేది మాత్రం క్రాక్ సినిమాకు మైనస్ అని చెప్పాలి. రిలీజ్ కు ముందే క్రాక్ సినిమా బుకింగ్స్ అన్ని ఫుల్ అయిపోయి.. ప్రీమియర్ షోతో పాటు ఫస్ట్ డే షూటింగ్ నిలిచిపోవడంతో అభిమానులు తీవ్రనిరాశకు గురయ్యారు. మాస్ రాజా అభిమానులు మార్నింగ్ షో అంటే ఉదయం చీకటి నుండి నైట్ సెకండ్ షో పడేవరకు వెయిట్ చేసి సినిమాను హిట్ చేశారు.
చివరిగా క్రాక్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అటు క్రిటిక్స్ నుండి ఇటు ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకొని వసూళ్లపరంగా దూసుకెళ్తుందని సమాచారం. అయితే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే సగం సీటింగ్ లో బెస్ట్ గానే వచ్చాయని చెప్పవచ్చు. క్రాక్ ఫస్ట్ డే గ్రాస్ వచ్చేసి 10.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే 6.25 కోట్ల కలెక్షన్స్.. అదికూడా 50% సీటింగ్ లో అంటే రికార్డు అనే అంటున్నాయి సినీవర్గాలు. ఈ పాండమిక్ టైంలో 10.5 కోట్ల కలెక్షన్స్ అంటే పైసావసూల్ చేసినట్లే. ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. నైజాంలో 2.28 కోట్లు, సీడెడ్ 1కోటి, యూఏ 85 లక్షలు, ఈస్ట్ 48లక్షలు, వెస్ట్ 28లక్షలు, గుంటూరు 65లక్షలు, కృష్ణ 45లక్షలు, నెల్లూరు 26లక్షలుగా కలెక్షన్స్ నమోదు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి క్రాక్ అనేది రాబోయే సినిమాలకు మంచి ఊపునిచ్చిందనే ఇండస్ట్రీ టాక్. ఇంకా మూడు రోజుల వరకు ఏ సినిమా రిలీజ్ లేకపోవడంతో క్రాక్ ఇంకా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరగనుందో..!!