ఆ సినిమాలకు టాలీవుడ్ ఒకటే లేటు

Update: 2016-02-03 17:30 GMT
బాలీవుడ్ లో ఇప్పుడు అడల్ట్ కామెడీల జోరు బాగా సాగుతోంది. సాధారణ చిత్రాల కంటే వీటి హవానే ఎక్కువగా ఉంది. కౌంట్ విషయంలో కూడా వీటి స్పీడ్ బాగా పెరిగింది. నెలకో అడల్ట్ కామెడీ చొప్పున దాడి చేసేస్తున్నాయి. ఈ తరహా పెద్దల చిత్రాలు వంద కోట్లు కొల్లగొడుతున్న దాఖాలాలు కూడా ఉంటున్నాయి.

హిందీలో వచ్చిన క్యా కూల్‌ హై హమ్‌ - మస్తీజాదే వంటి ఎడల్ట్‌ కామెడీలను చూసి..  మిగతా ఇండస్ట్రీలు కూడా ఇన్ స్పైర్ అవుతున్నాయి. ఇప్పుడు తమిళంలో కూడా ఇలాంటివే తీస్తున్నారు. ఇక మళయాళంలో అయితే చెప్పనక్కర్లేదు. నేరుగానే అడల్ట్  సెక్స్ సినిమాలు తీసే ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇండియాలోని మరికొన్ని చోట్ల కూడా ఈ బూతు సినిమాలు బాగానే వస్తాయి. వాటికి ఆదరణ కూడా ఎక్కువగానే ఉంటోంది. మన తెలుగులోనే ఇలాంటి సినిమాలు రావడం లేదు. తీసే ధైర్యం కూడా ఇప్పటివరకూ ఎవరూ చేయడం లేదు. ఈరోజుల్లో - ప్రేమ కథా చిత్రమ్‌ వంటి సినిమాల్లో జోకులు ఉంటాయి కాని.. అవి డబుల్ మీనింగులే. అంతే తప్ప  మరీ ఎడల్ట్‌ కామెడీలు కాదు.

ఆ జోకులు కూడా ద్వంద్వార్ధాలే ఉంటాయంతే. మరీ స్ట్రయిట్ గా బూతులు మాట్లాడే కల్చర్ మన సినిమాల్లో లేదు. ఈ రకంగా చూస్తే మనోళ్లే చాలా మంచోళ్లు. కానీ ఓ ట్రెండ్ బాలీవుడ్ లో మొదలైతే దాన్ని అప్పు తెచ్చేసుకోవడం టాలీవుడ్ లో ఎక్కువ. ఇంకా చెప్పాలంటే.. తెలుగులోనూ ఇలాంటి బూతు సినిమాలు చూసే రోజులు త్వరలో వచ్చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Tags:    

Similar News