వీడియో: అమ్మాయిలంతా మాయ అని చెబుతున్న అల్లు శిరీష్..!

Update: 2022-10-15 05:11 GMT
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "ఊర్వశివో రాక్షసివో". రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గార్జియస్ బ్యూటీ అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటించింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని వచ్చే నెలలో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

'ఊర్వశివో రాక్షసివో' సినిమా నుంచి ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ యూత్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. టీజర్ కు అనూహ్య స్పందన లభించింది. ఈ క్రమంలో ఇటీవల 'దీంతననా' అనే ఫస్ట్ సింగిల్ తో మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు 'మాయారే' అనే సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా 'మాయారే' సాంగ్ ప్రోమోని సోషల్ మీడియాలో వదిలారు. 'పోరీల ఎంటాబోకు ఫ్రెండూ.. ఆడుకుంటారు నిన్ను రౌండూ.. ఎందుకలా.. వై వై ఎందుకలా..' అంటూ సాగిన ఈ పాట అలరిస్తోంది. అమ్మాయిలంతా మాయ.. వాళ్ళతోటి పెట్టుకుంటే గాయలే.. జిందగీ గయా అంటూ ప్రేమలో విఫలమైన హీరో తన ప్రేయసిని తలచుకుంటూ పాడుకుంటున్నాడు.

'మాయారే' పాటకు అనూప్ రూబెన్స్ క్యాచీ ట్యూన్ సమకూర్చారు. గీత రచయిత కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనదైన శైలిలో ఆలపించాడు. ప్రోమో సాంగ్ లో అల్లు శిరీష్ వేసిన సింపుల్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో హీరోతో పాటుగా వెన్నెల కిశోర్ ని కూడా చూడొచ్చు.

దీనికి త‌న్వీర్ మిర్ సినిమాటోగ్రఫీ అందించగా.. బాబు ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. 'మాయారే' సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోని అక్టోబర్ 17న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు.

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని రూపొందించారు. ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఎం సహ నిర్మాతగా వ్యవహారించారు.

ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన "ఊర్వశివో రాక్షసివో" చిత్రాన్ని 2022 నవంబర్ 4న థియేటర్లలో విడుదల చేయనున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View


Tags:    

Similar News