త‌ల్లికోసం భ‌ర్త పిల్లల్ని వ‌దిలేసే ఇల్లాలిగా మీనా

Update: 2021-04-19 13:30 GMT
జీ 5 తమిళ వెబ్ సిరీస్ `కరోలిన్ కామాక్షి`తో సీనియ‌ర్ న‌టి మీనా తన డిజిటల్ అరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌టువైన భాష‌తో అభిమానులకు షాక్ ఇచ్చే పాత్ర‌లో మీనా క‌నిపించారు. కరోలిన్ కామాక్షిలో మీనాకు బలమైన పాత్ర ద‌క్కింది. ఇది తప్పిపోయిన వర్జిన్ మేరీని కనుగొనే ఘోరమైన మిషన్ గురించిన క‌థాంశం.

మీనా- జార్జియా- ఏంజెలీనా- ఆంటో త‌దిత‌రులు న‌టించారు. బ్యాడ్ ఫ్రెంచ్ డిటెక్టివ్ స్టైల్లో కామక్షి అనే సాంప్రదాయ తమిళ బ్రాహ్మణ అమ్మాయి ప‌య‌నాన్ని తెర‌పై చూపారు. ఈ వెబ్ సిరీస్ గురించిన ముచ్చ‌ట సాగుతుండగానే మీనా మ‌రో వెబ్ సిరీస్ కి అంగీక‌రించార‌ని తెలిసింది. ఇందులో స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ కూడా ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్నారు. త‌న త‌ల్లిని చివ‌రి రోజుల్లో ఆదుకునేందుకు భ‌ర్త పిల్ల‌ల్ని విడిచిపెట్టే ఇల్లాలి పాత్ర‌లో ఎమోష‌న‌ల్ గా మీనా క‌నిపించ‌నుందిట ఈ సిరీస్ లో. త‌మిళ కొత్త ద‌ర్శ‌కుడు మాధ‌వ‌న్ జూన్ నుంచి షూటింగ్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

సౌత్ అగ్ర క‌థానాయిక‌గా ఏలిన మీనా ఇటీవ‌ల‌ సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్ ల ప‌రంగా వేగం పెంచ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. మలయాళం-త‌మిళం- తెలుగు సినిమాల్లో మీనా న‌టిస్తున్నారు. దృశ్యం- దృశ్యం 2లోనూ మీనా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇప్పుడు తెలుగు దృశ్యం 2లోనూ మీనా న‌టిస్తున్నారు. మ‌రో త‌మిళ చిత్రంలోనూ మీనా న‌టిస్తూ కెరీర్ ప‌రంగా బిజీ అయ్యారు.




Tags:    

Similar News