మ‌హేష్ స‌ర‌స‌న హ‌ర్యానా బ్యూటీ

Update: 2021-10-22 03:30 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స్ర్కిప్ట్ లాక్ అయింది. `అత‌డు`..`ఖ‌లేజా` త‌ర్వాత ఈ ద్వ‌యం చేతులు క‌ల‌ప‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. మ‌హేష్ `స‌ర్కారు వారి పాట` చిత్రీక‌ర‌ణ పూర్తిచేసిన వెంట‌నే త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ నే ప‌ట్టాలెక్కించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో త్రివిక్ర‌మ్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో మ‌రింత బిజీ అయిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం న‌టీన‌టులు..సాంకేతిక నిపుణుల ఎంపిక‌లో త‌ల‌మున‌క‌లై ఉన్న‌ట్లు స‌మాచారం. టెక్నిక‌ల్ టీమ్ త్రివిక్ర‌మ్ పాత టీమ్ నే ఎక్కువ‌గా ఉంటుంది. చిన్న పాటి మార్పులు త‌ప్ప పెద్ద‌గా మార్పులకు అవ‌కాశం లేదు.

అయితే న‌టీన‌టుల ఎంపిక‌..హీరోయిన్ల ఎంపిక లో మాత్రం ఫ్రెష్ ఫీల్ని తీసుకొచ్చేలా క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ స‌ర‌స‌న సెకెండ్ లీడ్ లో మీనాక్షి చౌద‌ర‌ని ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. మొద‌టి హీరోయిన్ ఎంపిక విష‌యంలో అంత‌ర్లీనంగా చాలా విష‌యాలు ఉంటాయి కాబ‌ట్టి ఇంకా ఆ పాత్ర‌పై ఫోక‌స్ చేయ‌న‌ట్లు తెలుస్తోంది. ఇక మీనాక్షి విష‌యానికి వ‌స్తే అమ్మ‌డు టాలీవుడ్ కి `ఇచట వాహ‌న‌ములు నిలుప‌రాదు` చిత్రంతో ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ర‌వితేజ్ హీరోగా న‌టిస్తోన్న `ఖిలాడీ` లోనూ ఛాన్స్ అందుకుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది.

అలాగే ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `స‌లార్` లోనూ ఓ కీల‌క పాత్ర‌కు ఎంపికైంది. ఇలా మీనాక్షి చౌద‌రి స‌రైన హిట్ ప‌డ‌కుండా వ‌రుస‌గా బిగ్ స్టార్స్ చిత్రాల్లో బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు అందుకుంది. మీనాక్షి 2018 మిస్ ఇండియా టైటిల్ విజేత‌. సినిమాల‌కంటే ముందు బుల్లి తెర‌పైనా మెరిసింది. పాప్ సింగ‌ర్ గాను మీనాక్షి కొన్ని ఆల్బ‌మ్స్ చేసింది. చివ‌రిగా న‌టిగా స్థిర‌ప‌డింది. ప్ర‌స్తుతానికి టాలీవుడ్ లో అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. స‌క్సెస్ లు అందుకుంటే గ‌నుక అమ్మ‌డి క ఎరీర్ మూడు పువ్వులు..ఆరు కాయ‌లుగా సాగిపోవ‌డం ప‌క్కా.




Tags:    

Similar News