మీరా చోప్రా తెలుగులో నాలుగైదు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ ఎందుకో బ్రేక్ మాత్రం దక్కలేదు. మీరా చోప్రా అంటే ఎక్కువమంది సడెన్ గా గుర్తు పట్టలేరేమో కానీ పవన్ కళ్యాణ్ 'బంగారం' సినిమా హీరోయిన్ అంటే మాత్రం గుర్తు పట్టే అవకాశం ఉంది. ఆ సినిమా మాత్రమే కాదు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన 'వాన' లో కూడా మీరా హీరోయిన్ గానటించింది. ప్రస్తుతం తమిళం.. హిందీ సినిమాల్లో నటిస్తోంది.
ఈ భామ అందరిలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం అందరం లాక్ డౌన్ లో ఉన్నాం కదా. మీరా కూడా అలాగే లాక్ డౌన్ లో ఉందట.కాకపోతే మనకంటే ముందుగా హొలీ పండగ నుంచే బయటకు రావడంమానేసిందట. తన మనసులోని భావాలను క్యాప్షన్ రూపంలో వ్యక్తీకరించింది. "హొలీ తర్వాత బయటకు రావడం లేదు. దీంతో లాక్ డౌన్ నాకు 25 రోజులు అయింది. పగలంతా తింటూనే ఉన్నా.. నిద్ర సరిగా పట్టక పోవడంతో రాత్రి రెండు డిన్నర్లు చేస్తున్నా. మొదట్లో ఎక్సర్ సైజ్ చేసేదాన్ని. తర్వాత ఆందోళన కారణంగా అదీ మానేశాను. నేను బరువు పెరుగుతున్నానేమో అనే ఫీలింగ్ మొదలైంది. దీంతో ఇంట్లోనే యోగా చెయ్యడం మొదలుపెట్టాను. ఈ ఫోటో నేను వెయిట్ పెరిగానా లేదా అనే చెక్ చేసుకునేందుకు తీసుకున్నాను. ఇప్పుడు ఏదో ఒక ఎక్సర్ సైజ్ చేస్తున్నందుకు నేనుసంతోషంగా ఉన్నాను. మీకు కూడా ఇదో ప్రేరణగా ఉంటుందని భావిస్తున్నాను. #కరోనా టైమ్ #స్టే హెల్దీ" అంటూ పెద్ద స్టోరీ చెప్పింది.
ఈ స్టోరీ తో పాటుగా ఒక హాట్ ఫోటో కూడా పోస్ట్ చేసింది. బ్లాక్ టాప్.. ప్రింటెడ్ కలర్స్ ఉండే ప్యాంట్ ధరించి క్యాజువల్ గా ఉంది. ఫ్లాట్ గా ఉండే యాబ్స్ తో పర్ఫెక్ట్ కనిపిస్తోంది. అయితే మొహంలో అలసట మాత్రం కనిపిస్తోంది. ఏదేమైనా కరోనా లాక్ డౌన్ వలన ఆందోళన చెందాను అని ఓపెన్ గా చెప్పడం గొప్ప విషయమే. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 'నాస్తిక్' అనే ఓ హిందీ సినిమాలో నటిస్తోంది.