టాలీవుడ్ కు సంబంధించి ఇప్పటివరకు ఎప్పుడూ లేని ఒక విచిత్రమైన మీటింగ్ మంగళవారం చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి బోలెడన్ని మీటింగ్ ల గురించి విని ఉండొచ్చు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని ఒక కొత్త మీటింగ్ తాజాగా జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇష్యూస్ నేపథ్యంలో షూటింగ్ లను బంద్ చేయటం.. వివిధ వర్గాల వారితో సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా తాజాగా ఫిలిం ఛాంబర్.. నిర్మాతల మండలి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో షూటింగ్ లు షురూ చేయాలని డిసైడ్ చేయటం తెలిసిందే. అదే సమయంలో హీరోయిన్ల మేనేజర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ల పారితోషికాలు..
వారి సిబ్బంది ఖర్చుకు సంబంధించిన అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరగటం గమనార్హం. అధిక పారితోషికాలు.. సిబ్బందికి అవుతున్న ఖర్చులు తడిపి మోపెడు అవుతున్న నేపథ్యంలో.. వాటికి సంబంధించిన అంశాలను చర్చించారు. దీనిపై తాజాగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా దిల్ రాజు వెల్లడించారు.
తాము తీసుకున్న నిర్ణయాలు ఏమిటన్న విషయం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)కు సమాచారం అందిస్తామని చెబుతున్నారు. త్వరలో మిగిలిన యూనియన్లు.. ఫెడరేషన్ ద్వారా సమాచారం అందజేస్తామని చెబుతున్నారు. ఇప్పటికి 90 శాతం చర్చలు పూర్తి అయినట్లు చెబుతున్నారు. హీరోయిన్ల పారితోషికాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్నది బయటకు రావాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. హీరోయిన్ల పారితోషికంలో కోతలతో పాటు..
ఇప్పటివరకు సిబ్బందికి సంబంధించిన ఖర్చులు యథాతధంగా నిర్మాత మీద పడుతున్నాయి. అందుకు భిన్నంగా.. వాటికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఖర్చులు తగ్గించటమే లక్ష్యంగా చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.
చర్చల్లో హీరోయిన్ల సిబ్బందికి పెట్టే ఖర్చులో యాబై శాతానికి పైనే కోత విధించాలని.. వారికి అయ్యే ఖర్చును ప్యాకేజీ రూపంలో ఇచ్చేలా ప్రతిపాదనలు రావటం.. వాటిని తమ హీరోయిన్లతో మాట్లాడి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని మేనేజర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడూ లేని రీతిలో హీరోయిన్ల మేనేజర్లతో ఛాంబర్ నిర్వహించిన ఈ మీటింగ్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.