మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత ఏడాది 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న నేపథ్యంలో ఆయన తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. అయితే రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన 'వినయ విధేయ రామ' చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమాపై గతంలో ఎప్పుడు లేని విదంగా ట్రోల్స్ వచ్చాయి. చరణ్ ఎప్పుడు ఎదుర్కోని వింత ట్రోల్స్ ను ఆ సినిమాకు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతటి ఫ్లాప్ మూవీని తాజాగా ఉపాసన వీకెండ్ లో చూసేందుకు సిద్దం అయినట్లుగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
ట్విట్టర్ లో ఉపాసన ఎప్పుడైతే అమెజాన్ ప్రైమ్ లో తాను వినయ విధేయ రామ చిత్రాన్ని చూడబోతున్నట్లుగా ప్రకటించిందో వెంటనే పెద్ద ఎత్తున కామెంట్స్ వెళ్లువెత్తాయి. అందులో ఎక్కువ శాతం మంది వదినమ్మ ఆ సినిమాకు మీరు దయచేసి దూరంగా ఉండండి అంటూ సలహా ఇచ్చారు. మీరు ఆ సినిమాను థియేటర్ల చూడనట్లయితే ఇప్పుడు కూడా చూడకండి. ఎందుకంటే ఆ సినిమా చూసి మీరు డిస్ట్రబ్ అవుతారు అంటూ కొందరు కామెడీగా కామెంట్స్ చేశారు. మొత్తానికి ఉపాసనకు వింత వింత కామెంట్స్ రావడం జరిగింది.
వినయ విధేయ రామ చిత్రం ఫ్లాప్ నుండి వెంటనే బయట పడ్డ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి భారీ మల్టీస్టారర్ మూవీ 'ఆర్ ఆర్ ఆర్' లో నటిస్తున్న విషయం తెల్సిందే. వినయ విధేయ రామ డ్యామేజీ ని సునాయాసంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ కవర్ చేస్తుందని మెగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.