అల్లుడికి పోటీగా చిన్న మామ‌ ..ఇది త‌గునా ప‌వ‌న్ జీ!

Update: 2022-08-28 08:33 GMT
మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ `ఉప్పెన‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. డెబ్యూతోనే భారీ స‌క్సెస్ అందుకుని ఇండ‌స్ర్టీ దృష్టిని ఆక‌ర్షించాడు. కానీ అటుపై చేసిన `కొండ‌పొలం` మాత్రం తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. ఇది క్రిష్ తెర‌కెక్కించిన డిఫ‌రెంట్ జాన‌ర్ కాబ‌ట్టి  దాని గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడాల్సిన ప‌నిలేదు. దీంతో మెగా అల్లుడు వ‌రుణ్ తేజ్ త‌రహాలో  క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌పాటు డిఫ‌రెంట్ జాన‌ర్స్ ని ఈ ర‌కంగా బ్యాలెన్స్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది.

త్వ‌ర‌లో వైష్ణ‌వ్ తేజ్ `రంగ రంగ వైభ‌వంగా` అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోత‌న్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబ‌ర్ 2న ఈచిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో అల్లుడు ఎలాగైనా హిట్ అందుకోవాలి.  ఇది ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ సినిమా. ప్ర‌స్తుతం ఉన్న పోటీలో స‌క్సెస్ లేక‌పోతే వెనుక‌బ‌డే ప్ర‌మాదం ఉంది. మెగా అల్లుడ్ని ఇప్పుడ‌దే ఎక్కువ‌గా టెన్ష‌న్ కి గురి చేస్తుంది.

అయితే ఇప్పుడా ఒత్తిడి మ‌రింత పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.  అందుకు కార‌ణం చిన్న మామ..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార‌ణ‌మా? అంటే అవున‌నే వినిపిస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 2న `జల్సా` 4కె-డాల్మిఅట్మాస్ లో రీరిలీజ్ చేస్తున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్ దాదాపు 500 కు పైగా స్పెష‌ల్ ఏర్పాటు చేస్తున్నారు.

జ‌న‌సేన స‌హ..మెగా అభిమానుల కోరిక మేర‌కు రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడిదే టెన్ష‌న్ లో వైష్ణవ్ తేజ్ క‌నిపిస్తున్నాడు. జ‌ల్సా రీ రిలీజ్ అయితే త‌ని  సినిమాకి ఏ  మెగా హీరో వ‌స్తాడు? అన్న ఆందోళన మొద‌లైన‌ట్లు క‌నిపిస్తుంది. అల్లుడు భ‌యంలో నిజ‌ముంది. అందులో అర్ధం ఉంది. ఇటీవ‌లి కాలంలో రీ రిలీజ్ లు సైతం బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి.

ఆ మధ్య మ‌హేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా `పోకిరి` రీరిలీజ్ అయి సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు అన్ని షోలు ఫుల్ అయ్యాయి. రీ రిలీజ్ కి ఈ రేంజ్ లో  రెస్పాన్స్ ఉంటుందా? అని వ‌సూళ్లు చూసి షాక్ అవ్వాల్సిన స‌న్నివేశం ఎదురైంది. ఇక జ‌ల్సా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ విష‌యంలో ప‌వ‌న్ అభిమానులు ఎంత‌గా చెల‌రేగిపోతారో చెప్పాల్సిన ప‌నిలేదు.

తెలుగు రాష్ర్టాలు స‌హా ఓవ‌ర్సీస్ లో  ప‌వ‌న్ కి డై హార్ట్ ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. ప‌వ‌న్ న‌టించిన ఏ సినిమా రిలీజ్ అయినా హిట్ చేయాల్సిన బాధ్య‌త‌గా భావించి..త‌మ భుజ స్కందాల‌పై ఆ బ‌రువును మోస్తుంటారు. ఈ నేప‌థ్యంలో జ‌ల్సా రీ రిలీజ్ అయితే స‌న్నివేశం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. పైగా రీరిలీజ్ లు ఇప్పుడు  ఓ ట్రెండ్ లా మారిపోయాయి. ఇవ‌న్నీ మెగా అల్లుడి గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తున్నాయి. మ‌రి చిన్న మామ‌కి పోటీగా వ‌స్తున్న అల్లుడు  జ‌నాల్ని ఎంత వ‌ర‌కూ ఆక‌ర్షిస్తాడో చూడాలి.
Tags:    

Similar News