కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మెగా హీరోల డామినేషన్ స్పష్టంగా కనిపించేది. ఇండస్ట్రీ టాప్ హిట్స్ లో మొదటి మూడు సినిమాలు.. టాప్5లో నాలుగు సినిమాలు మెగా హీరోలవే ఉండేవి. చాలా ఏళ్ల పాటు ఫస్ట్ ప్లేస్ లో మగధీర ఉండగా.. దాన్ని పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మాత్రమే ఓవర్ టేక్ చేయగలిగింది. కానీ ఇప్పుడు మాత్రం టాప్ 3 స్లాట్స్ ఏవీ మెగా హీరోల ఖాతాలో లేవు.
టాలీవుడ్ కలెక్షన్స్ లెక్కలను మార్చేసిన బాహుబలి.. ఫస్ట్ ప్లేస్ లో అందనంత ఎత్తులో కూర్చుంది. ఆ తర్వాత రెండో స్థానంలో మహేష్ బాబు శ్రీమంతుడు ఉండగా.. బాహుబలికి శ్రీమంతుడికి మధ్య చాలా గ్యాప్ ఉంది. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్.. టాప్ 3 ప్లేస్ ని ఆక్యుపై చేసింది. దీంతో.. టాప్ 4లో అత్తారింటింకి దారేది.. ఐదో స్థానంలో మగధీర నిలిచాయి. ఇండస్ట్రీ హిట్స్ టాప్3లో మెగా హీరోలు చోటు కోల్పోయిన సంగతి యాక్సెప్ట్ చేయాల్సిందే. మరి దీన్ని అందుకోవడానికి వాళ్లేం చేయబోతున్నారన్నదే ఇప్పుడు అసలు పాయింట్.
నిజానికి బాహుబలి తర్వాత టాలీవుడ్ కలెక్షన్స్ జోరు బాగానే పెరిగింది. అక్కడి నుంచి అఫీషియల్ గా టికెట్ కౌంటర్ లో రేట్లు 25 శాతం పెరిగిన సంగతి మర్చిపోకూడదు. పైగా దశాబ్దాల తరబడి థియేటర్లకు దూరంగా ఉన్న ఆడియన్స్ ను కూడా రప్పించిన ఘనత బాహుబలిది. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలకు ఇదే పాయింట్ బాగా ప్లస్ అయింది. దానకి తగ్గట్టే కంటెంట్ తో కూడా ప్రూవ్ చేసుకోవడంతో ఇప్పుడు టాప్ 3 స్లాట్స్ ను నాన్-మెగా సినిమాలు సింపుల్ గా ఆక్యుపై చేసి కూర్చున్నాయి. అయితే ఈ స్లాట్స్ కు పోటీనివ్వడానికి మెగా హీరోలు మరోసారి తమ దండయాత్రను రెడీ చేస్తున్నారులే.
ఇప్పుడు నాలుగు మెగా సినిమాలు సిద్ధమవుతున్నాయి. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150.. రామ్ చరణ్ ధృవ.. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు.. సెట్స్ పై ఉండగా.. స్టైలిష్ స్టార్ డీజే-దువ్వాడ జగన్నాథం షూటింగ్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. డివైడ్ టాక్ వస్తేనే ఇండస్ట్రీ హిట్స్ అయిపోయే కలెక్షన్స్ వస్తున్న తరుణంలో.. ఈ నాలుగింటిలో దేనికి టాక్ పాజిటివ్ గా ఉన్నా.. టాప్5 లెక్కలను సరిచేసేయడం పెద్ద విషయమేం కాదు. బాహుబలి రికార్డులు టచ్ చేయలేనంత దూరంలో లేవని కబాలి ప్రూవ్ చేశాడు కదా.. సో చూద్దాం.. టాప్ 3 లో మళ్లీ మెగా హవా ఎప్పుడు మొదలవుతుందో.
ఎట్ ది సేమ్ టైమ్.. మహేష్ మురుగుదాస్ సినిమా.. బాహుబలి 2.. వంటి దిగ్గజాలు కూడా రేసుకు రెడీ అవుతున్నారు. నిజంగానే ఇప్పుడు సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ.