కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ టైం అంత బాగున్నట్టు లేదు. సినిమాలకు బై చెప్పి... ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగినప్పటి నుంచి ఆయనపై వ్యక్తిగత దాడులు పెరిగిపోయాయి. మొన్నటి వరకు కత్తి మహేష్ అనుకుంటే... ఇప్పుడు శ్రీరెడ్డి కూడా మొదలుపెట్టింది. ఈ కష్టకాలంలో ఊహించనట్టుగా యంగ్ హీరోలు పవన్ కు మద్దతుగా నిల్చున్నారు. పవర్ స్టార్‌కు అతని అభిమానులకు ఇది కాస్త ఊరటనిస్తోంది.
కత్తిమహేష్ ఎన్నో నెలలుగా పవన్‌పై దాడి చేస్తున్నాడు. అయినా పెద్దగా పవన్ స్పందించలేదు. అతని అభిమానులకు కత్తి మహేష్‌కు మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. చివరికి రెండు వర్గాలు రాజీపడినట్టే కనిపించాయి. కానీ కత్తి మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా పవన్‌పై విరుచుకుపడుతూనే ఉన్నాడు. ఏవేవో రాతలు రాస్తూ కూతలు కూస్తూ పవన్ సేనను రెచ్చగొడుతూనే ఉన్నాడు. ఇతనే పెద్ద తలనొప్పి మారాడనుకుంటే ఈ మధ్యనే శ్రీరెడ్డి అండ్ కో కూడా పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్‌కౌచ్ బారిన పడిన ఆర్టిస్టులంతా ఒక్కటై మీడియా ముందుకు వచ్చారు. అసలు మనుషులని వదిలి పవన్ తిట్టడం మొదలుపెట్టారు.
క్యాస్టింగ్ కౌచ్ గురించి పవన్ మీడియాతో మాట్లాడుతూ.... బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించాలని సలహా ఇచ్చారు. ఆ సలహానే ఇప్పుడు పవన్ కు తలనొప్పిగా మారింది. రాజకీయాలలో ఉంటే ఇలాంటి సలహానేనా ఇచ్చేది అంటూ శ్రీరెడ్డి ఇతర బాధిత మహిళలు పవన్ ను టార్గెట్ చేశారు. శ్రీరెడ్డి మరీ నీచంగా పవన్ గురించి మాట్లాడింది. పవర్ స్టార్ మాత్రం ఈ విషయంపై స్పందించకుండా మౌనం పాటించారు. పవన్ కు మద్దతుగా నితిన్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి యంగ్ హీరోలు ముందుకొచ్చారు.
వారి వారి ట్విట్టర్ ఖాతాలలో పవన్ అభిమానులు కత్తి మహేష్ శ్రీరెడ్డి లాంటి వాళ్లు చేస్తున్న కామెంట్లను పట్టించుకోవద్దని రాశారు. పవన్‌ను వెనకేసుకొచ్చారు. వీరు తప్ప సినిమా పెద్దలెవరూ ఇంతవరకూ పవన్‌కు మద్దతుగా రాలేదు. పవన్ అభిమానులు ఈ ముగ్గురు హీరోలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.