#ఆర్ సీ15 శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తొలి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత చరణ్ చేస్తోన్న చిత్రమిది. ఈసినిమా విజయంపై చరణ్ కాన్పెడెంట్ గా ఉన్నాడు. దేశం గర్వించ దగ్గ దర్శకుడు కాబట్టి ధీమా సహజమే. అయితే ఆర్ సీ 16 విషయంలో మాత్రం ఆ కాన్పిడెన్స్ లేదు. అందుకే గౌతమ్ తిన్ననూరితో చేయాల్సిన సినిమాని క్యాన్సిల్ చేసారు.
అతని జెర్సీ హిందీ రీమేక్ పరాభవం కూడా రద్దుకి ఓ కారణంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చరణ్ 16వ సినిమా ఏ దర్శకుడితో చేస్తాడు? అన్న విషయంలో డైలమా మొదలైంది. ఈ నేపథ్యంలో చరణ్ టాలీవుడ్ డైరెక్టర్లతో ముందుకెళ్తాడా? పరభాషా దర్శకుల వైపు చూస్తాడా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చరణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో టాలీవుడ్ దర్శకులతో ముందుకెళ్లే అవకాశం కనిపించలేదు.
సందీప్ వంగ..ప్రశాంత్ నీల్ లాంటి వారు ఇప్పటికే వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. వాళ్లతో సినిమాలు చేయడానికి సమయం పడుతుంది. అంత వరకూ వెయిట్ చేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియాలో చరణ్ ఆవిష్కరించే తెలుగు డైరెక్టర్ టాలీవుడ్ లేడు అన్నది చరణ్ మరో ఆలోచనగా కనిపిస్తుంది. పూరి..కొరాటాల..బోయపాటి..లాంటి వారిని ఇప్పుడున్న పరిస్థితుల్లో చరణ్ నమ్మలేడు.
యువ ట్యాలెంటెడ్ మ్యాకర్స్ ని నమ్మి ముందుకెళ్లలేడు. ఈ నేపథ్యలో చరణ్ మనసంతా కోలీవుడ్ మేకర్స్ పైనే ఉన్నట్లు లీకుందుతున్నాయి. ఇప్పటికే లోకేష్ కనగరాజ్ కి టచ్ లోకి వెళ్లాడు. ఇటీవలే డాడ్ కి `గాడ్ ఫాదర్` రూపంలో భారీ సక్సెస్ ఇచ్చిన మోహన్ రాజా కూడా మైండ్ లో ఉన్నాడు. `తని ఒరువన్ -2` స్ర్కిప్ట్ సిద్దం చేస్తున్నాడాయన.
అలాగే `కాఖీ`...`వలిమై` లాంటి సక్సెస్ లు అందించిన హెచ్. వినోథ్ తో కూడా చరణ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు మెస్ట్ ట్యాలెంటెడ్ టెక్నీషియన్ల అన్వేషణ కొనసాగిస్తున్నారు. మొత్తాగా తాజా సన్నివేశాన్ని పరిశీలిస్తే చరణ్ మనసు కోలీవుడ్ మేకర్స్ పైనే ఉందని అర్ధమవుతుంది. ఆర్ సీ 16 పై త్వరలోనే క్లారిటీ ఇస్తామని పీఆర్ టీమ్ ప్రకటించిన నేపథ్యంలో చరణ్ నిర్ణయం అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.