వరుస పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ కళకలలాడుతోంది. చిన్న సినిమాలు కూడా భారీ విజయాల్ని నమోదు చేస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధిస్తున్నాయి. కొన్ని చిత్రాలు భారీ అంచనాలతో విడుదలై కంటెంట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో భారీ ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. కొన్ని చిత్రాలే మాత్రం భారీ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. 'కేజీఎఫ్ 2' వంటి కన్నడ చిత్రం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది.
ఇదిలా వుంటే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇండస్ట్రీ పరిస్థితిపై తాజా సంచలన వ్యాఖ్యలు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'అశోక వనంలో అర్జున కల్యాణం'. విద్యాసాగర్ చింత ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం వివాదం మధ్య విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఫన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజే మంచి టాక్ ని సొంతం చేసుకుని హిట్ అనిపించుకుంది.
ఓ టీవీ ఛానల్ కారణంగా విశ్వక్‌సేన్ పై వివాదం తలెత్తడంతో 'అశోక వనంలో అర్జున కల్యాణం' టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ వివాదంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ పెరిగి తొలి రోజు భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా ఈ మూవీ సక్సెస్ మీట్ ని ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశ వ్యాప్తంగా సినీ ఇండస్ట్రీ ఏమీ బాగాలేదన్నారు. 'అశోక వనంలో అర్జున కల్యాణం' చిత్ర బృందాన్ని అభినందించిన ఆయన ఇలాంటి సమయంలో ఇలాంటి సినిమాలే ఎక్కువగా ఆడాలన్నారు. గత రెండేళ్లలో ఇండస్ట్రీ చాలా మరిందని, ఇండస్ట్రీ వాతావరణం కూడా ఏమంత ఆరోగ్యకరంగా లేదన్నారు.
రెగ్యులర్ గా సినిమాలు చూసే ప్రేక్షకుల్లోనూ విప్లవాత్మక మార్పులొచ్చాయన్నారు. గతంలో భార్యలు భర్తలని సరదాగా వీకెండ్స్ లో సినిమాకు తీసుకెళ్లమని అడిగే వారని, కానీ ఇప్పడు మాత్రం ఓటీటీలో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూసే కాలం వచ్చేసిందని వాపోయారు.
అయితే ఈ సినిమాతో మళ్లీ పాత కల్యర్ వచ్చేసిందని చెప్పుకొచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ పరిస్థితి మద్దెల దరువులా మారిందని, అక్కడ స్టార్స్ నటించిన సినిమాలు కనీసం ఓపెనింగ్స్ ని కూడా రాబట్టలేకపోతున్నాయన్నారు. ఇది చాలా దారుణం అని, ఇండస్ట్రీ వర్గాలు ఈ డేంజర్ ట్రెండ్ నుంచి బయటపడటం కోసం మనస్పర్థల్ని పక్కన పెట్టి అత్యుత్తమ ఫలితాల కోసం ప్రయత్నించాలన్నారు. చివరిగా మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని, అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టాలని, మళ్లీ ఇండస్ట్రీకి సరికొత్త ఊపిరులూదాఅని ఆకాంక్షించారు.