సుజీత్ కి మెగాస్టార్ ఛాన్సిస్తున్నారా?

Update: 2020-03-05 07:18 GMT
సుజీత్ కి మెగాస్టార్ ఛాన్సిస్తున్నారా?
  • whatsapp icon
సాహో చిత్రంతో సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్రెస్ అయ్యాడు సుజీత్. చాలా చిన్న‌ వ‌య‌సులో భారీ కాన్వాసుతో పాన్ ఇండియా సినిమాకి ప‌ని చేసిన యువ‌ద‌ర్శ‌కుడిగా అత‌డి పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. అయితే సాహో హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద సాధించినంత పెద్ద విజ‌యం సౌత్ లో సాధించ‌క‌పోవ‌డం అత‌డికి మైన‌స్ అయ్యింది. అయితే ఒక ద‌ర్శ‌కుడి స‌త్తాను అంచనా వేయ‌డానికి హిట్టు ఫ్లాపుతో ప‌ని లేకుండా కొన్ని క్వాలిటీస్ ని కూడా ప‌రిశీలించాల్సి ఉంటుంది.

ఈ విష‌యంలో మెగాస్టార్ చిరంజీవి `సాహో` ద‌ర్శ‌కుడు సుజీత్ ని ఎన‌లైజ్ చేసిన తీరు ప్ర‌స్తుతం పరిశ్ర‌మ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సుజీత్ అంత భారీ బడ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డ‌మే ఓ సాహ‌సం అనుకుంటే.. ఆ సినిమాలో ప్ర‌భాస్ ని అత్యంత స్టైలిష్ గా ఆవిష్క‌రించాడ‌ని చిరు భావిస్తున్నార‌ట‌. అందుకే ఇప్పుడు మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ లూసిఫ‌ర్ చిత్రాన్ని రీమేక్ చేస్తే త‌న‌ని అంతే స్టైలిష్ గా లావిష్ గా చూపించ‌గ‌ల‌డ‌ని కూడా చిరు భావిస్తున్నార‌ట‌.

దీన‌ర్థం... వీవీ వినాయ‌క్ ... హ‌రీష్ శంక‌ర్ లాంటి ద‌ర్శ‌కుల కంటే లూసీఫ‌ర్ రీమేక్ ఆఫ‌ర్ సుజీత్ కే క‌ట్ట‌బెడితే బావుంటుంద‌ని మెగాస్టార్ భావిస్తున్నారా? అంటే... ప్ర‌స్తుతానికి ఇది స‌స్పెన్స్. ఇక త‌మిళంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఇటీవ‌లి కాలంలో అంద‌రూ యువ‌ద‌ర్శ‌కుల‌నే న‌మ్ముతున్నారు. వెట‌రన్ డైరెక్ట‌ర్ల‌ను సైతం ప‌క్క‌న పెట్టి యంగ్ ట్యాలెంటుకు అవ‌కాశం ఇస్తున్నారు. ఒక్క మురుగ‌దాస్ ద‌ర్బార్ త‌ప్ప అంత‌కుముందు వ‌రుస‌గా యువ ద‌ర్శ‌కుల‌కే అవ‌కాశాలిచ్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే చిరు కూడా యంగ్ డైరెక్ట‌ర్ల‌లో ట్యాలెంటును గుర్తించి ప్రోత్స‌హించ‌ద‌లిచార‌నే తాజా మూవ్ మెంట్ చెబుతోంది. సుజీత్ లాంటి ద‌ర్శ‌కుడిని వ‌న్ ఫిలిం వండ‌ర్ గా చూడ‌కుండా... అత‌డిలో టెక్నికాలిటీస్ చూసి అవ‌కాశం ఇవ్వాల‌నుకోవ‌డం మెచ్చ‌ద‌గిన‌దే. మ‌రి సుజీత్ కి లూసీఫ‌ర్ రీమేక్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టేనా లేదా? అన్న‌ది కాస్త ఆగిగే కానీ క్లారిటీ రాదేమో!
Tags:    

Similar News