టాలీవుడ్ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఆయన అభిమానులు దాదాపు రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆయన సినిమా ఎప్పుడెప్పడు థియేటర్లలోకి వచ్చేస్తుందా? ఎప్పుడెప్పుడు చూసేయ్యాలా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారి మెగాస్టార్ తో కలిసి మెగా పవర్ స్టార్ కూడా కలిసి ఒకే సినిమాలో సందడి చేయడంతో మెగా అభిమానుల్లో ఆ ఆసక్తి మరింత రెట్టింపైంది. ఇద్దరు అభిమాన హీరోలని ఒకే స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూడాలా? అని ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారి కలిసి నటించిన చిత్రం 'ఆచార్య'.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అయితే మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి చాలా రోజులవుతున్నా ఈ ప్రాజెక్ట్ నుంని అప్ డేట్ వచ్చి చాలా రోజులే అవుతోంది. ఈ నేపథ్యంలో మెగా స్టార్ అభిమానులకు మెగా ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు.
ఏప్రిల్ 12న మంగళవారం సాయంత్రం 5:49 నిమిషాలకు 'ఆచార్య' ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నామంటూ ఇప్పటికే ప్రకటించేసింది. ఈ సినిమా కోసం దాదాపు రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులకు 'ఆచార్య' టీమ్ మెగా ట్రీట్ ని ప్లాన్ చేసింది. ఇది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రం. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ని కూడా 153 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఇదే విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన థియేటర్లతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పాపులర్ థియేటర్లలో 'ఆచార్య' ట్రైలర్ ని ప్రదర్శించబోతున్నారు.
ఇందుకు సంబంధించిన థియేటర్స్ లిస్ట్ ని కూడా మేకర్స్ సోమవారం సోసల్ మీడియా ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 'ఆచార్య' రిలీజ్ కు ముందే ట్రైలర్ ట్రిట్ తో మెగా అభిమానులు సెలబ్రేషన్స్ మోడ్ లోకి వెళ్లబోతున్నారు. ట్రైలర్ రిలీజ్ తో ఓ రేంజ్ లో బిగ్ స్క్రీన్స్ లో మాస్ యుఫోరియా ప్రారంభం కాబోతోంది. ఇక థియేటర్ల వద్ద మాస్ అభిమానులు పూనకాలతో జాతరకు శ్రీకారం చుట్టడం ఖాయం అంటున్నారు.
'ఆచార్య' చిత్రాన్ని సామాజిక అంశం నేపథ్యంలో కొరటాల శివ తెరకెక్కించారు. దేవాదాయ భూముల కుంభ కోణం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఇందులో మెగాస్టార్ ఎండో మెంట్ అధికారిగానూ, ఓ దశలో నక్సలైట్ గా నూ కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు చరణ్ పాత్రకున్న సంబంధం ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ గా నిలవనుంది.
ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలో సందడి చేయబోతోంది. చిరు, చరణ్ కలిసి ఒకే తెరపై కనువిందు చేయబోతుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే వున్నాయి. ఆ రేంజ్ కి మించని స్థాయిలో సినిమా వుంటే ఫ్యాన్స్ కి పండగే.