మెగాస్టార్ చిరంజీవి కథా నాయకుడి గా నటించనున్న 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య లాంఛనంగా సినిమా ప్రారంభించారు. ఇప్పటికే చిరు న్యూ లుక్ కూడా రివీల్ అయింది. మెగాస్టార్ ని వెండి తెరపై సరికొత్తగా ఆవిష్కరించబోతున్నాడు. మునుపెన్నడు చూడనిది మెగాస్టార్ 152 లో చూడబోతున్నామన్న ప్రచారం అంతకంతకు వెడెక్కిస్తోంది. దేవాలయ భూముల స్కాం నేపథ్యం.. రాజకీయం...నక్సలిజం బ్యాక్ డ్రాప్ అనే మూడు అంశాలతో ఈ సినిమా తెరకెక్కనుందని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. ఈ వారంలోనే రెగ్యులర్ షూట్ కి వెళ్లనున్నారు.
ఇక హీరోయిన్ గా అందాల త్రిషని ఎంపకి చేసారని ఓ ప్రచారం ఇప్పటికే వెడెక్కిస్తూనే ఉంది. తాజాగా కథానాయికకు సంబంధించి మరో ఆసక్తికర అప్ డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కాన్వాసు అనూహ్యంగా మారింది. ఇప్పుడు దీనిని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని కొరటాల-రామ్ చరణ్ సంకల్పిస్తున్నారుట. సైరా నరసింహా రెడ్డి తరహా ప్లాన్ ఇది.. అని ప్రచారమవుతోంది. ఇక సైరా పాన్ ఇండియా లెవల్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉన్నా..మెగాఖ్యాతి మాత్రం విశ్వ వ్యాప్తమైంది. ఇప్పుడా క్రేజ్ నే కొరటాల-చిరు మరింతగా పెంచే ప్రయత్నంలో ఉన్నారట. అందులో భాగంగా పాన్ ఇండియా కేటగిరీ లో సినిమా తీయాలని బడ్జెట్ రేంజును పెంచారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో త్రిష స్థానంలో బాలీవుడ్ భామని రంగంలోకి దించాలని భావిస్తున్నారుట. దానివల్ల అటు బాలీవుడ్ లోనూ చిరు 152 మైలేజ్ పెరుగుతుంది. మార్కెట్ రేంజు విస్తరించనుందని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి 100కోట్లు మించిన బడ్జెట్ అంటూ ఓ గుసగుస కొణిదెల కాంపౌండ్ లో వినిపిస్తోంది.
అయితే ఈ పాన్ ఇండియా ఐడియానే త్రిష కొంప ముంచింది. ఆ నిర్ణయంతోనే త్రిషను ఎలిమినేట్ చేస్తున్నారన్న కొత్త వార్త ఫిలిం సర్కిల్స్ లో సైతం ఆసక్తికరంగా మారింది. త్రిష ఇప్పటికే తెలుగులో ఫేంను కోల్పోయింది. మరీ ఓల్డ్ హీరోయిన్ అన్న విమర్శ వినిపిస్తోంది. ఈ కారణం గానూ ఎంతో ఆలోచించి కోరటాల యూటర్న్ తీసుకున్నారని ఇంకొంత మంది అంటున్నారు. మరి ఈ కథనాల్లో నిజానిజాలు తేలాల్సి ఉంది. గతంలో త్రిష మెగాస్టార్ సరసన స్టాలిన్ లో నటించిన సంగతి తెలిసిందే.