కొన్ని రోజులుగా టాలీవుడ్ చిత్రపరిశ్రమలో మా అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అందులోను తాజాగా మెగాబ్రదర్ నాగబాబు కూడా ఎంటర్ అవ్వడంతో పరిస్థితి మరింత రసవత్తరంగా మారింది. ఈరోజు యాక్టర్ ప్రకాష్ రాజ్ నిర్వహించిన మీడియా సమావేశంలో మెగాబ్రదర్ నాగబాబు పాల్గొన్నాడు. అలాగే ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తికీ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాట్లాడాడు. ప్రస్తుతం నాగబాబు మాట్లాడిన మాటలు మా అసోసియేషన్ సభ్యులలో సంచలనం రేకేత్తిస్తున్నాయి.
ఈ సందర్బంగా మెగాబ్రదర్ మాట్లాడుతూ.. "మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు పరోక్షంగా ప్రకాష్ రాజ్ వైపే ఉన్నాయంటూ చెప్పారు. ప్రకాశ్ రాజ్ నాయకత్వంలో సిని'మా' ప్యానల్ వైపు తన మద్దతు తెలుపుతూ నాగబాబు మాట్లాడారు. "ప్రకాశ్ రాజ్ మంచి మనస్సున్న వ్యక్తి. మా అసోసియేషన్ కు ప్రస్తుతం ఇలాంటి వ్యక్తులు అవసరం చాలా ఉందన్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి 2 నెలల కిందటే ప్రకాశ్ రాజ్ మా వద్దకు వచ్చారు. ప్రస్తుతం 'మా'లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి పూర్తిగా వివరాలు సేకరించి తెలిపారు. అలాగే 'మా'ను ఉన్నతస్థాయికి తీసుకువెళ్లడానికి ఆయన ప్రణాళికలు కూడా మాతో చర్చించారు.
ప్రకాష్ రాజ్ మాటలు విన్న తర్వాత నాకు అతని పై నమ్మకం కలిగింది. ప్రకాశ్ రాజ్ అన్ని ఇండస్ట్రీలతో మంచి అనుబంధం కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరితో చక్కగా మాట్లాడతారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి నాకెంతో ముచ్చటేసింది. వారు ఎలాంటి వారో చూడకుండా అందరితో కలిసిమెలిగే ప్రకాష్ రాజ్ అవసరం 'మా'కి ఉంది. ఇంకా లోకల్ - నాన్ లోకల్ అనే మాటలు అర్ధం లేనివి. 'మా'లో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో ఏ పదవికోసమైనా పోటీ చేసే హక్కు ఉంది. ఆయన తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలు దత్తత తీసుకుని ఉన్నారు. ప్రకాష్ రాజ్ సేవాతత్వం 'మా' కోసం ఆయన వేసిన ప్రణాళికలు చూసి నా మద్దతు తెలపడానికి వచ్చాను. అయితే అన్నయ్య చిరంజీవి కూడా 'ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నేను సపోర్ట్ చేస్తాను' అన్నారని తెలిపారు.