టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ `వాల్తేరు వీరయ్య`. బాబి దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. రూ. 108 కోట్ల రాబట్టి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇక ఓవర్సీస్ లో ఈ మూవీ 1, 7 మిలియన్ డాలర్లని రాబట్టి అక్కడ హల్ చల్ చేస్తోంది.
మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రలో నటించి ఈ మూవీకి ప్రధాన ఎస్సెట్ గా నిలవడం విశేషం. ఇందులో చిరుకు జోడీగా శృతిహాసన్ నటించింది. తనకు పెద్దగా స్కోప్ లేదు. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ అయిన డే వన్ నుంచి మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ సందర్భంగా చిరు దర్శకుడిని ఆకాశానికి ఎత్తేయడం తెలిసిందే. ఇప్పటికీ అదే ఫాలో అవుతూ బాబిపై ప్రశంసలు కురిపిస్తుండటం విశేషం.
అయితే ఉన్నట్టుండి చిరు దర్శకుడు బాబిపై `వాల్తేరు వీరయ్య` ప్రమోషన్స్ లో పొగడ్తల వర్షం కురిపించడానికి ప్రధాన కారణం నెట్టింట వినిపించిన ట్రోల్సేనని తెలుస్తోంది. ఈ సినిమాకు ముందు చిరు నటించిన మూవీ `ఆచార్య`. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తరువాత జరగిన ప్రతీ సినిమా ఈవెంట్ వేదికగా దర్శకుడు కొరటాల శివసపై ఇండైరెక్ట్ గా చిరు పంచ్ లు వేసిన విషయం తెలిసిందే. కొంత మంది దర్శకులు సెట్ లోనే అన్నీ రాస్తున్నారని, ముందస్తు రాసుకోకుండా సెట్ లోకి వచ్చాకే రాస్తున్నారని, దాని వల్ల సినిమా ఫలితం తారు మారవుతోందని విమర్శలు గుప్పించారు.
అయితే కొరటాలని చిరు టార్గెట్ చేస్తున్నాడంటూ నెట్టింట దీనిపై పెద్ద దుమారమే రేగింది. నెటిజన్ లు చిరుని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు కూడా. ఈ విషయంలో తన వ్యక్తిగత టీమ్ ద్వారా తెలుసుకున్న చిరు అప్పటి నుంచి డ్యామేజీ కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. స్లేజ్ పై దర్శకులని ఇకపై విమర్శించరాదనే ఆలోచనకు వచ్చిన చిరు అప్పటి నుంచి `వాల్తేరు వీరయ్య` దర్శకుడు బాబిపై ప్రశంసలు కురిపిస్తున్నారట.
ఇదిలా వుంటే సంక్రాంతి బరిలో జనవరి 13న విడుదలైన ఈ మూవీ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే 108 కోట్లు మేర వసూళ్లని రాబట్టిన ఈ మూవీ ఓవర్సీస్ లో 1. 7 మిలియన్ మార్కుని దాటేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఈ ఫిగర్స్ మరింతగా పెరిగే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.