మెగాస్టార్ స్టార్ట్ చేస్తే మూడు గుమ్మడి కాయలు కొట్టే వరకు నో బ్రేక్!
కరోనా కారణంగా ఎన్నో సినిమా లు బాక్సాఫీస్ వద్దకు రావాల్సి ఉన్నా ఆగిపోయాయి. గత ఏడాది అనుకున్న సినిమాలను ఈ సమ్మర్ లో విడుదల చేసేందుకు ప్రయత్నించారు. కాని సెకండ్ వేవ్ వల్ల టాలీవుడ్ కు చెందిన పదుల కొద్ది సినిమా లు వాయిదా పడ్డాయి. అందులో మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కూడా ఉంది. చిరంజీవి తో పాటు రామ్ చరణ్ కూడా ఆచార్య లో నటించడంతో పాటు ఇప్పటి వరకు ప్లాప్ అనేది తెలియని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కొరటాల శివ ఈ సినిమా ను కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేసి గత ఏడాది ఆగస్టులో విడుదల చేయాలనుకున్నాడు. కాని కరోనా ఆయన ప్లాన్స్ పూర్తిగా రివర్స్ అయ్యేలా చేసింది.
సమ్మర్ కు ముందు ఈ సినిమా పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా బారిన విలన్ సోనూసూద్ పడటంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత లాక్ డౌన్ కారణంగా కూడా షూటింగ్ జరగలేదు. మరో వారం పది రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉండగా ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే పునః ప్రారంభం కాబోతుంది. ఆచార్య కోసం నాలుగు అయిదు రోజుల పాటు చిరంజీవి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట. ఆ తర్వాత షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకుండా వెంటనే మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.
లూసీఫర్ ఇప్పటికే చాలా నెలలుగా వాయిదాలు పడుతూ వస్తోంది. కనుక ఖచ్చితంగా ఈసారి లూసీఫర్ ను పూర్తి చేసి తీరాలని భావిస్తున్నాడు. ఈ లూసీఫర్ ను కూడా రెండు నుండి మూడు నెలల్లోనే పూర్తి చేయాల్సిందిగా దర్శకుడికి చిరంజీవి చెప్పాడట. ఆచార్య కు గుమ్మడి కాయ కొట్టడమే ఆలస్యం వెంటనే లూసీఫర్ ను మొదలు పెట్టి గుమ్మడి కాయ కొట్టే వరకు బ్రేక్ తీసుకోవద్దని నిర్ణయించుకున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లూసీఫర్ తో పాటు మరో సినిమా ను కూడా చిరంజీవి మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అది వేదాళం రీమేక్ అయ్యి ఉండవచ్చే లేదంటే బాబీ దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా అయినా అయ్యి ఉండవచ్చు అంటున్నారు.
మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్యతో పాటు మరో రెండు సినిమా లకు కూడా ఇదే ఏడాదిలో గుమ్మడి కాయ కొట్టేలా ప్లాన్ చేస్తున్నారు. పరిస్థితులను అనుసారంగా సినిమాల విడుదల తేదీలను నిర్ణయిస్తారని టాక్ వినిపిస్తుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఆచార్యతో పాటు ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాయో చూడాలి. లూసీఫర్ రీమేక్ షూటింగ్ ను ఆగస్టులో మొదలు పెడితే వచ్చే సంక్రాంతికి చిరంజీవి కూడా బాక్సాఫీస్ బరిలో నిలుస్తాడేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.