మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ 'గాడ్ ఫాదర్'. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. పొలిటికల్యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసీఫర్' ఆధారంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
చిరు కెరీర్ లోనే చాలా ప్రత్యేకతలతో సరికొత్త నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. మలయాళ సినిమా స్క్రిప్ట్ ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి చిరు పాత్రని మరింత స్టైలిష్ గా మార్చి తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన చిరు ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. స్టైలిష్ లుక్ లో బ్లాక్ గాగుల్స్ ధరించి స్టైల్ గా కూర్చుని రాజసం చూపించిన చిరు లుక్ టెర్రిఫిక్ గా వుంది. ఈ స్టిల్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
'లూసీఫర్'లో మోహన్ లాల్ వైట్ అండ్ వైట్ లో లుంగీ ధరించి కనిపిస్తే ఆ లుక్ ని తెలుగులో కంప్లీట్ గా మార్చేశారు. రీసెంట్ గా విడుదల చేసిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. సునీల్ డోర్ తీయగానే చిరు స్టైల్ గా కారులోంచి దిగి నడుచుకుంటూ వెళ్లిన తీరు ఫ్యాన్స్ ని మరింతగా ఆకట్టుకుంది. ఇదిలా వుంటే ఈ మూవీ బ్యాలెన్స్ షూటింగ్ ని జూలై 28 నుంచి ముంబైలో పూర్తి చేయబోతున్నారట. ఇటీవలే లాంగ్ వెకేషన్ కి వెళ్లిన మెగాస్టార్ ఫ్యామిలీతో కలిసి రీసెంట్ గా హైదరాబాద్ తిరిగి వచ్చారు.
వెంటనే యాక్షన్ లోకి దిగిపోయారు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న 'భోళా శంకర్' తాజా షెడ్యూల్ ని పూర్తి చేశారు. రీసెంట్ గా మొదలైన బాబి డైరెక్ట్ చేస్తున్న 'వాల్తేరు వీరయ్య' తాజా షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
దీనితో పాటు త్వరలో 'గాడ్‌ఫాదర్' బ్యాలెన్స్ షూట్ ని కూడా పూర్తి చేయబోతున్నారట. సల్మాన్ ఖాన్, చిరు పాల్గొనగా పలు కీలక ఘట్టాల షూటింగ్ పెండింగ్ వుందట. సల్మాన్ డేట్స్ కేటాయించడంతో ఈ మూవీ బ్యాలెన్స్ షూటింగ్ ని జూలై 28న ముంబైలో ప్రారంభించబోతున్నారని తెలిసింది.
ఈ షెడ్యూల్ లోనే పెండింగ్ గా వున్న సీన్ లని పూర్తి చేయబోతున్నారట. ఇదే షెడ్యూల్ లో చిరు, సల్మాన్ లపై ఓ పాటని కూడా షూట్ చేయబోతున్నారని తెలిసింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని దసరా బరిలోకి దించేస్తున్నారు. సెప్టెంబర్ 29న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.