కూతురు కోసం మెగాస్టార్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ...!

Update: 2022-04-26 07:30 GMT
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు. ఆమె మొన్నటి వరకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా.. స్టైలిస్ట్‌ గా వ్యవహరించారు. ఇప్పుడు ఆమె గోల్డ్ బాక్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. సుష్మిత కొణిదెల వరుసగా ప్రాజెక్ట్‌ లతో తెలుగు ప్రేక్షకులకు మస్త్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ ను అందించే ప్రయత్నాలు చేస్తున్నారు.

గోల్డ్‌ బాక్స్ ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్‌ లో మొదటగా సుష్మిత కొణిదెల ఒక వెబ్‌ సిరీస్ ను నిర్మించింది. ఆ వెబ్‌ సిరీస్ కు మంచి పేరు వచ్చింది. ఆ వెబ్‌ సిరీస్ తెచ్చిన పేరుతో సినిమాల నిర్మాణం పై మెగా డాటర్ దృష్టి పెట్టింది. చేతిలో పెద్ద మెగా హీరోలు ఉన్నా... పెద్ద దర్శకులు చాలా మంది పరిచయం ఉన్నా కూడా సుష్మిత మొదటగా ఒక చిన్న సినిమాను నిర్మించారు. ఆ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.

సుష్మిత గోల్డ్‌ బాక్స్ బ్యానర్ లో తెరకెక్కిన శ్రీదేవి శోభన్ బాబు సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇటీవలే ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ వేడుక లో శ్రీదేవి శోభన్ బాబు సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ను విడుదల చేయడం జరిగింది. ఒక సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మరో సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. కాని కూతురు కోసం తన సినిమా వేడుకలో ఆమె సినిమా ను చిరంజీవి ప్రమోట్‌ చేశాడు.

కేవలం సినిమా ప్రమోషన్ మాత్రమే కాదు కూతురు నిర్మాణ సంస్థను కూడా ప్రమోట్‌ చేసేందుకు మెగా స్టార్‌ సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. ఎలాగూ శ్రీదేవి శోభన్ బాబు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిరంజీవి భాగస్వామ్యం అవుతారు. అంతకు మించి అన్నట్లుగా గోల్డ్‌ బాక్స్ బ్యానర్‌ లో ఒక సినిమాను చేసేందుకు చిరంజీవి ఓకే చెప్పాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

కథ మరియు దర్శకుడు సెట్‌ అయితే గోల్డ్‌ బాక్స్ బ్యానర్‌ లో కూతురు కోసం సినిమాను చేసేందుకు గాను చిరంజీవి ఓకే చెప్పడం జరిగిందట. చిరంజీవి సినిమా అంటే మినిమంగా 60 నుండి 80 కోట్ల బడ్జెట్‌ ఉంటుంది. సుష్మిత ఆ స్థాయిలో పెట్టనవసరం లేకుండా తన పారితోషికం మొత్తంను రద్దు చేసుకునేందుకు కూడా చిరంజీవి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మెగా కాంపౌండ్‌ నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి జీరో పారితోషికంతో కూతురు సుష్మిత కొణిదెల బ్యానర్‌ గోల్డ్‌ బాక్స్ లో సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడట. కూతుర్ల కోసం చిరంజీవి ఎన్నో చేస్తాడు. ఇప్పుడు ఒక సినిమాను ఫ్రీ ఫ్రీ గా కూతురు బ్యానర్‌ లో నటించేందుకు మెగాస్టార్‌ ఓకే చెప్పాడు. ఆయన ఒక్కో సినిమాను ఇచ్చే డేట్లను అనుసారంగా 30 కోట్ల నుండి 50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడని టాక్‌.

అంత మొత్తాన్ని కూడా కూతురు కోసం వదిలేశాడు. మరి సుష్మిత ఈ ఆఫర్‌ ను ఎంత త్వరగా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. ఇక చిరు సినిమాల విషయానికి వస్తే ఆచార్య సినిమా ఈ వారంలో విడుదల కాబోతుంది. ఇదే ఏడాది చివరి వరకు గాడ్‌ పాదర్ విడుదల కాబోతుంది. మరో వైపు భోళా శంకర్‌ మరియు వాల్తేరు వీరన్న సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.

ప్రస్తుతం కమిట్‌ అయిన సినిమాలన్నీ పూర్తి అయితే అప్పుడు కూతురు సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అంటే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో కూతురు సినిమా ను చిరు చేసే అవకాశాలు ఉన్నాయని మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది.
Tags:    

Similar News