సూపర్ స్టార్ మహేష్ సోదరుడు రమేష్ బాబు (56) ఆకస్మిక మరణం ఇండస్ట్రీని షాక్ కి గురి చేసిన సంగతి తెలిసిందే. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో గచ్చిబౌళి ఏఐజీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారన్న వార్తతో ఘట్టమనేని అభిమానులకు బిగ్ షాక్ నిచ్చింది.
ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల నుంచి సంతాపం వ్యక్తమైంది. రమేష్ బాబు నటుడిగా నిర్మాతగా పరిశ్రమలో కొనసాగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు మెగాస్టార్ చిరంజీవి- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి పలువురు స్టార్లు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాల్లో స్పందించారు. వరుణ్ తేజ్ ఇతరులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఆయన ఆకస్మిక మరణ వార్తను ధృవీకరిస్తూ.. తొలిగా ఘట్టమనేని పీఆర్వో కీ.శే. బిఎ రాజు అధికారిక ట్విట్టర్ నుంచి సమాచారం అందింది.``మా ప్రియమైన రమేష్ బాబు గారు మరణించారని మేము చాలా బాధతో తెలియజేస్తున్నాము. ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు. మేము మా శ్రేయోభిలాషులందరినీ కోవిడ్ నిబంధనలకు కట్టుబడి దహన సంస్కారాల స్థలంలో గుమిగూడకుండా ఉండవలసిందిగా అభ్యర్థిస్తున్నామని ఘట్టమనేని కుటుంబం`` వెల్లడించిందని ట్వీట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ``శ్రీ.జి.రమేష్ బాబు మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలా బాధగా ఉంది. శ్రీ.కృష్ణ గారు .. మహేష్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద నష్టాన్ని తట్టుకునే శక్తిని ఆ కుటుంబానికి సర్వశక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను`` అని సంతాపం వ్యక్తం చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్వీట్ చేస్తూ..``నటుడు.. నిర్మాత శ్రీ ఘట్టమనేని రమేష్ బాబు గారు కన్నుమూశారని తెలిసి దిగ్బ్రాంతికి లోనయ్యాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రముఖ నటులు శ్రీ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగించారు. అనంతరం చిత్ర నిర్మాణంలోకి వచ్చి విజయాలు అందుకొన్నారు. సోదరుడు మహేష్ బాబుతో అర్జున్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ కృష్ణ గారు పుత్రశోకాన్ని దిగమింగుకోవాల్సిన క్లిష్ట సమయం. కృష్ణగారికి కుటుంబ సభ్యులకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. శ్రీ రమేష్ బాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను`` అని పవన్ కల్యాణ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. దర్శకుడు రమేష్ వర్మ ట్వీట్ చేస్తూ ``ఇది విని షాక్ అయ్యాను. కృష్ణ గారు.., మహేష్ బాబు గారు & కుటుంబ సభ్యులందరికీ సానుభూతి. ఓం శాంతి`` అని సంతాపం వ్యక్తం చేశారు.
కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు తన క్రిస్మస్-న్యూ ఇయర్ సెలవుల నుండి విదేశాలకు తిరిగి వచ్చినప్పుడు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ.. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.