మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పించు `లాల్ సింగ్ చ‌డ్డా`

Update: 2022-07-20 17:01 GMT
మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్- కరీనా కపూర్ ఖాన్- చైతన్య అక్కినేని నటించిన `లాల్ సింగ్ చద్దా` ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ట్రైల‌ర్ తో అమీర్ హైప్ పెంచిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌చార చిత్రం ఆద్యంతం హృద‌యాల్ని ట‌చ్ చేసే ఎమోష‌న్స్ తో మైమ‌రిపించింది.

ముఖ్యంగా అమీర్ ఖాన్.. నాగ‌చైత‌న్య‌ అభిమానులకు ఇది స్పెష‌ల్ ట్రీట్ గా నిల‌వ‌నుంది. మంచు ప‌ర్వ‌తాల్లో సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించిన‌ ఈ చిత్రం భారతీయత‌ను దేశ‌భ‌క్తిని ఎలివేట్ చేయ‌నుంది.

అమీర్ - కరీనా కపూర్ ఖాన్ బ్లాక్ బస్టర్ `3 ఇడియట్స్` తర్వాత మ‌రోసారి క‌లిసి ప‌ని చేసారు.

అక్కినేని నాగ‌చైత‌న్య‌కు ఇది బాలీవుడ్ ఎంట్రీ మూవీ కావ‌డంతో అత‌డి అభిమానుల్లో ఉత్కంఠ నెల‌కొంది. చైతూ పాత్ర కూడా ఇందులో ఎంతో ఉత్కంఠ‌ను పెంచుతుంద‌ని ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు ట్రైల‌ర్ వెల్ల‌డించాయి. ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య బాలరాజు అనే పాత్రలో నటించారు. మేకర్స్ తాజాగా నాగ చైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్ లో ఆహ్లాద‌క‌ర‌మైన చిరునవ్వుతో ఆర్మీ దుస్తుల్లో చై నిజ‌మైన సైనికుడిని త‌ల‌పిస్తున్నాడు.

ఈ చిత్రంలో మోనా సింగ్ అమీర్ తల్లి పాత్రలో న‌టించారు. సీక్రెట్ సూపర్ స్టార్ తర్వాత చాలా కాలానికి అమీర్ ఖాన్ - అద్వైత్ చందన్ `లాల్ సింగ్ చద్దా` కోసం తిరిగి కలిసి ప‌ని చేశారు.

మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్- కిరణ్ రావు - వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించాయి. ఈ ఏడాది ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు-త‌మిళం-హిందీలో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ప్ర‌చారం ఊపందుకుంది. ఇంత‌కుముందే మెగాస్టార్ చిరంజీవి- అక్కినేని నాగార్జున- ఎస్.ఎస్. రాజమౌళి- సుకుమార్- రామ్ చరణ్ లకు అమీర్ ఖాన్ స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించారు.
Tags:    

Similar News