బాస్ లోని ముఠామేస్త్రిని కెలికిన బాబి

Update: 2021-08-22 11:37 GMT
2020 క‌రోనా క్రైసిస్ మొద‌టి వేవ్ సమ‌యంలోనే నాలుగు స్క్రిప్ట్ ల‌ను ఫైన‌ల్ చేసి త‌న‌తో ప‌ని చేసే న‌లుగురు దర్శ‌కుల‌ను మెగాస్టార్ చిరంజీవి ప‌రిచ‌యం చేశారు. అందులో కొర‌టాల శివ‌తో ఆచార్య చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఇప్ప‌టికే మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసీఫ‌ర్ రీమేక్ `గాడ్ ఫాద‌ర్` (చిరు 153) ప్రారంభ‌మైంది.  త‌దుప‌రి వేదాళం రీమేక్ మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కత్వంలో 155వ సినిమాగా తెర‌కెక్క‌నుంది. నేడు ఈ సినిమా టైటిల్ భోళా శంక‌ర్ అంటూ ప్ర‌క‌టించారు.

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154 వ చిత్రంపైనా ఈ శ‌నివారం అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ చిత్రం సముద్ర నేపథ్యంలో పూర్తి మాస్ స్టోరీతో తెర‌కెక్క‌నుంద‌ని తాజాగా రివీల్ చేసిన పోస్ట‌ర్ వెల్ల‌డిస్తోంది. చిరంజీవి పూర్తి మాస్ అవతారంతో స‌ర్ ప్రైజ్ ఇవ్వనున్నారు. ఎర్రటి టవల్.. బీడీ తాగుతూ.. లుంగీ ధరించిన చిరంజీవి బోట్ పై నిలబడి క‌నిపిస్తున్నారు. స‌ముద్రంలో లంగ‌ర్ వేసి దొంగ‌త‌నాలు చేసే బంధిపోటునే త‌ల‌పిస్తున్నాడు బాస్ ని చూస్తుంటే.. పోస్ట ర్ లో చిరు ఊర మాస్ గా కనిపిస్తున్నారు. జెండాలో చిరంజీవికి ఇష్టమైన దేవుడు- హనుమంతుని ఫోటో కనిపిస్తోంది. పోస్టర్ లో ఉద‌యించే సూర్యుడిగా చిరు క‌నిపిస్తున్నారు.

ఇక స‌ముద్రంలోని బోట్ చుట్టూ కొంద‌రు మాస్ కనిపిస్తున్నారు. వారు సముద్రంలో చేపలు పట్టడానికి వెళుతున్నారా.. ?  లేక ఓడ‌ల్లో క‌రెన్సీని వేటాడుతారా? అన్న‌ది అర్థం కావ‌డం లేదు. ముఠా మేస్త్రి- ఘరానా మొగుడు- రౌడీ అల్లుడు త‌ర‌హా లుక్ ఇది. నాటి రోజులను చిరంజీవి గుర్తుచేస్తున్నారు.. పూనకాలు లోడింగ్..అంటూ హింట్ ఇచ్చారు.

మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ త‌న ఫేవ‌రెట్ కోసం శక్తివంతమైన స్క్రిప్ట్ రాశారు. ఇది అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌నుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. #మెగాస్టార్ 154 కి చిరంజీవికి అనేక చార్ట్ బస్టర్ ఆల్బమ్ లను అందించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ ఎర్నేని - వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీకే మోహన్ సహ నిర్మాత.
Tags:    

Similar News