మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన రేంజ్ ఏమాత్రం తగ్గలేదు అని ఖైదీ నెంబర్ 150 సినిమాతో అయితే చాలా క్లారిటీగా అర్థమయిపోయింది. అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందుకోలేకపోయాయి. నటన విషయంలో మెగాస్టార్ పై పెద్దగా నెగిటివ్ కామెంట్స్ అయితే ఏమీ రావడం లేదు.
కానీ కంటెంట్ ఇంకా పాత తరహాలోనే ఉండడంతో జనాలు ఆయన సినిమాలపై కాస్త ఫోకస్ తగ్గించారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి తన పాత స్టైల్ లోనే సినిమాలను తెరపైకి తీసుకువస్తూ ఉండడం విశేషం. ఇక మెగాస్టార్ చిరంజీవి గత నాలుగు సినిమాలకు సంబంధించిన బిజినెస్ ట్రాక్ ఎంతవరకు వెళ్ళింది అలాగే ఇప్పుడు వాల్తేరు వీరయ్య బిజినెస్ ఎంత జరిగింది అని వివరాల్లోకి వెళితే..
ఖైదీ నెంబర్ 150 సినిమా 89 కోట్ల వరకు థియేటర్ బిజినెస్ చేయగా ఈ సినిమా టార్గెట్ అయితే తొందరగానే పూర్తి చేసుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన పాన్ ఇండియా మూవీ సైరా 195 కోట్ల బిజినెస్ చేసింది. కానీ ఆ సినిమా చాలా ఏరియాలలో నష్టాలను మిగిల్చింది. ఇక ఆచార్య సినిమా 136 కోట్ల వరకు బిజినెస్ చేయగా దాదాపు 80 నుంచి 90 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.
మెగాస్టార్ కెరీర్ లోని అదొక ఒక అత్యంత దారుణమైన డిజాస్టర్.
ఇక గాడ్ ఫాదర్ సినిమా అయితే 90 కోట్ల వరకు బిజినెస్ చేసింది. కానీ ఈ సినిమా ఆ టార్గెట్ మాత్రం పూర్తి చేయలేకపోయింది. కేవలం కొంత నష్టాలతో మాత్రమే తప్పించుకున్నారు. ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా 88 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. జనవరి 13న రాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ టార్గెట్ ను మెగాస్టార్ చిరంజీవి పూర్తి చేస్తారో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.