మెగాస్టార్ చిరంజీవి- మణిశర్మ కాంబినేషన్ లో చార్ట్ బస్టర్లు బ్లాక్ బస్టర్ల గురించి ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. బావగారూ బాగున్నారా మొదలు ఈ జోడీ దాదాపు 10 సినిమాలకు కలిసి పని చేశారు. చూడాలని ఉంది-అన్నయ్య-ఇంద్ర-ఠాగూర్-స్టాలిన్.. ఇలా ఆ ఇద్దరి జర్నీ కలిసే కొనసాగింది.
కానీ ఆ తర్వాత కొన్ని మనస్ఫర్థల వల్ల ఆ కాంబినేషన్ విడిపోవడంపై గుసగుసలు వినిపించాయి. రకరకాల కారణాలతో చిరు మణిశర్మని దూరం పెట్టేశారని కథనాలొచ్చాయి. అయితే కాలక్రమంలో చిరు బర్త్ డే కోసం ప్రత్యేకించి మణిశర్మ శ్రద్ధ తీసుకుని పాటల్ని కంపోజ్ చేసి మరీ ప్రసన్నం చేసుకున్నారు. ఏ మనస్ఫర్థలు చివరివరకూ ఉండవని ఆచార్య ఆఫర్ తో అర్థమైంది.
ఓవైపు ఇస్మార్ట్ శంకర్ సినిమాకి చక్కని రీరికార్డింగ్ తో పాటు ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇవ్వడంలో సఫలమయ్యారు. ఆ క్రమంలోనే దేవీశ్రీ- థమన్ లాంటి యంగ్ వేవ్ ఉన్నా.. మణిశర్మ ఏకంగా డజను ప్రాజక్టులతో బిజీ అయ్యారు. అందులో ఆచార్య కూడా ఒకటి. నిజానికి ఆచార్యకు ఏ.ఆర్.రెహమాన్ అంతటివాడిని సంప్రదించాలని చూసినా కుదరలేదు. బాలీవుడ్ ట్యాలెంట్ ని పరిశీలించారు. కానీ చివరికి మణిశర్మనే కొరటాల - చిరు ఫైనల్ చేసారు.
అయితే తనపై నమ్మకం ఉంచి ఇంతదాకా వచ్చాక చిరు ఎందుకనో మణిశర్మ మ్యూజిక్ పై అసంతృప్తిగా ఉన్నారని ఓ గాసిప్ తాజాగా షికార్ చేస్తోంది. ఆచార్య థీమ్ టీజర్ మ్యూజిక్ విషయంలో ఎందుకనో అసంతృప్తి బయటపడిందని గుసగుసలు వినిపించాయి. తొలిసారి సరిగా కుదరకపోవడంతో మరోసారి మార్పులు సూచించారట చిరు.
ప్రస్తుత సన్నివేశంలో చిరు అసంతృప్తి వల్ల మణిశర్మ మరో గోల్డెన్ ఛాన్స్ మిస్సవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. చిరు-బాబి-మైత్రి కాంబో మూవీకి మణిశర్మనే తొలుత అనుకున్నా.. అతడిని ఎంపిక చేస్తారా? లేదా? అన్న సందిగ్ధత నెలకొందట. అయితే ఇవన్నీ నిజమా కాదా? అన్నదానికి ఆధారాల్లేవ్. కేవలం గాసిప్పులు మాత్రమే. దీనిపై ఇరు టీమ్ లు స్పందిస్తాయేమో చూడాలి.