బీచ్ సొగసుల విశాఖ నగరం ఏపీ పరిపాలనా రాజధాని కాబోతోందన్న వార్తతో ఉత్తరాదిన ప్రజలు సంబరాలు చేసుకుంటున్న వైనం కనిపిస్తోంది. పరిపాలనా వికేంద్రీకరణ అనే నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు. యువ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి డేరింగ్ డెసిషన్స్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఇక వైజాగ్ రాజధాని అన్న మాట విన్నప్పటి నుంచి సినిమా సెలబ్రిటీల్లోనూ సరికొత్త ఉత్సాహం నెలకొందని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఏపీ విడిపోయాక.. కచ్ఛితంగా విశాఖ నగరంలోనే కొత్త టాలీవుడ్ పురుడు పోసుకుంటుందని ఊహించిన పలువురు సినీపెద్దలు భారీ ఎత్తున భూముల్ని కొన్నది విశాఖలోనే. వైజాగ్ రుషికొండ మొదలు రామానాయుడు స్టూడియోస్.. అటుపై కాపులుప్పాడ- భీమిలి వరకూ కొన్ని వందల ఎకరాల్ని సినీప్రముఖులు కొనుక్కున్నారని ప్రచారమైంది.
వైజాగ్ ఔట్ స్కర్ట్స్ లో మెగా ఫ్యామిలీకి భారీగా భూములున్నాయని అక్కడ భారీగా ఫిలింస్టూడియోని నిర్మించాలన్న ఆలోచన చేశారని అప్పట్లోనే ప్రచారమైంది. భీమిలి పరిసరాల్లో మెగాస్టార్ కి భూములు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం రాజధాని ప్రకటించారు కాబట్టి అక్కడ ఫిలింస్టూడియో నిర్మించేందుకు చిరు-చరణ్ బృందం పావులు కదుపుతున్నారని ఓ ప్రచారం వేడెక్కిస్తోంది. ఇందుకోసం చిరు-చరణ్ ఇప్పటికే యువ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డిని కలిసారన్న గుసగుసలు ఇన్ సైడ్ వినిపిస్తున్నాయి. మెగా ప్రపోజల్ కు ఏపీ సీఎం జగన్ నుంచి పాజిటివ్ స్పందన వచ్చిందట. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్సుందన్న ఊహాగానాలు వేడెక్కిస్తున్నాయి. ఒకవేళ మెగా ఫ్యామిలీ విశాఖలో ఫిలింస్టూడియో నిర్మాణానికి ఉపక్రమిస్తే ఇతర సినీపెద్దల్లోనూ కదలిక వస్తుంది. ఇక ఇప్పటికే షూటింగులు చేస్తూ ఉన్న వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ కి మరింతగా శోభ వచ్చేస్తుంది. భారీగా కార్పొరెట్ దిగ్గజాలు ఆ దిశగా అడుగులు వేసే వీలుంటుందని అంచనా వేస్తున్నారు.
ఇంతకుముందు చెన్నయ్ కి చెందిన ప్రఖ్యాత ఏవీఎం స్టూడియోస్ అధినేతలు.. నటసింహా నందమూరి బాలకృష్ణ సైతం వైజాగ్ లో ఫిలింస్టూడియోల నిర్మాణానికి ఆసక్తి కనబరచారని అంబికా కృష్ణ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ- ఎఫ్ డీసీ ప్రకటించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఓటమి తర్వాత సీన్ మారింది. మరి ఇప్పుడు ఔత్సాహికులను ఆహ్వానించి ఆ మేరకు కొత్త టాలీవుడ్ కి సంకల్పించడంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారా? అసలు వైజాగ్ టాలీవుడ్ విషయంలో ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి? అన్నది క్లియర్ కట్ గా తేలాల్సి ఉంటుంది. అందుకు అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.