మెగాస్టార్ అతిథిగా ఫిలింక్రిటిక్స్ గోల్డెన్ జూబ్లీ వేడుక‌

Update: 2021-07-24 16:50 GMT
మ‌ద్రాసు నుంచి తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ వ‌చ్చి స్థిర‌ప‌డిన క్ర‌మంలోనే తెలుగు ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ కార్య‌కలాపాలు విస్త్ర‌త‌మైన సంగ‌తి తెలిసిందే. ఐదు ద‌శాబ్ధాలు పైగా సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న ఈ అసోసియేషన్ కి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. టాలీవుడ్ వార్త‌ల‌ను నిరంత‌రం ప్ర‌జ‌ల‌కు చేర‌వేసే క్రిటిక్స్ అవిశ్రామ కృషి ఎప్పుడూ ఎంతో గొప్పది. ఈ క‌రోనా క‌ష్ట కాలంలో మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన సీసీసీ కార్య‌క‌లాపాల‌ను.. ఆక్సిజ‌న్ బ్యాంకుల‌తో సేవ‌ల గురించి క్రిటిక్స్ విస్త్ర‌తమైన క‌వ‌రేజీని ఇచ్చారు. ఇక క్రిటిక్స్ కి మెగాస్టార్ చిరంజీవి సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ స‌హా సినీపెద్ద‌ల అండ‌దండ‌లు ఉన్నాయి.

రెండేళ్ల కోసారి క్రిటిక్స్ ఎన్నిక‌లు జ‌రుగుతుంటాయి. చాలా గ్యాప్ త‌ర్వాత 2017-18 సీజ‌న్ ఎన్నిక‌లు జ‌రిగాయి. మ‌ళ్లీ ఈ ఆదివారం ( 25 జూలై 2021)  ఉదయం 10గం.లకు క్రిటిక్స్ జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం జరగనుంది. అదే రోజు ఎన్నిక‌లు కూడా జరగనున్నాయి. 2019-2021 సీజ‌న్ కి కొత్త అధ్య‌క్ష కార్య‌ద‌ర్శులు క‌మిటీని క్రిటిక్స్ మెంబ‌ర్స్ ఎన్నుకోనున్నారు. అలాగే క్రిటిక్స్ మెంబ‌ర్ షిప్ ల‌ను పున‌రుద్ధ‌రించ‌నున్నారు.

జూన్ 30న జ‌రిగిన స‌మావేశంలో కార్య‌వ‌ర్గం ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారిగా సీనియ‌ర్ స‌భ్యులు కె. ల‌క్ష్మ‌ణ్‌రావుగారిని.. క్రిటిక్స్ స‌భ్యుడు పి. హేమ‌సుంద‌ర్ గారిని ఎంపిక చేసారు. జూలై 25న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ లో ఈ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి.

26-5-2019 నుంచి 25-7-2021 వ‌ర‌కు  కార్య‌వ‌ర్గం నిర్వ‌హించిన నివేదిక ప్ర‌కారం..  53 సంవ‌త్స‌రాలుగా మ‌నుగ‌డ సాగిస్తున్న ఈ కీల‌క‌ అసోసియేష‌న్ లో ఎంద‌రో బాధ్య‌త‌లు నిర్వ‌హించి అసోసియేష‌న్ ఉనికిని కాపాడారని అధ్య‌క్ష కార్య‌ద‌ర్శులు సురేష్ కొండేటి- జ‌నార్థ‌న్.పి ప్ర‌శంసించారు. ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ .. మెగాస్టార్ చిరంజీవి గారిని క‌లిసి అసోసియేష‌న్ వేడుక‌ల గురించి వివ‌రించామ‌ని .. 50 సంవ‌త్స‌రాల అసోసియేష‌న్ గోల్డెన్ జూబ్లి ఫంక్ష‌న్ కు పూర్తిగా  స‌హ‌క‌రిస్తాన‌ని వారు హామీ ఇచ్చార‌ని తెలిపారు. తెలంగాణ మీడియా అకాడ‌మి చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ‌ను మ‌ర్య‌ద‌పూర్వ‌కంగా క‌లిసి అసోసియేష‌న్ వ్య‌వ‌హారాలు చ‌ర్చించిన‌ట్టు వెల్ల‌డించారు. క‌రోనా కార‌ణంగా ఒక ఏడాది పాటు స‌హాయ స‌హ‌కార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించిన అసోసియేష‌న్ మరికొన్ని ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌లేక పోయింది. అసోసియేష‌న్ కి ప‌లువురు సినీపెద్ద‌లు విరివిగా విరాళాల్ని అందించ‌గా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు వాటిని వినియోగిస్తున్నామ‌ని తెలిపారు.

10 ఏళ్ల త‌రువాత హైద‌రాబాద్ బ‌షీర్‌బాగ్ కార్యాల‌యం కోసం టీయూడబ్యు వారికి లేఖ అందించి ల‌క్ష్మ‌ణ్ రావు గారి స‌హ‌కారంతో కార్యాల‌యాన్ని స‌మ‌కూర్చుకొన్నామ‌ని తెలిపారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఇబ్బందుల్లో ఉన్న‌ క్రిటిక్స్ కి ఆర్థిక సాయం చేసామ‌ని వెల్ల‌డించారు. క‌రోనా స‌మ‌యంలో చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీసీ నుంచి.. త‌ల‌సాని స‌హ‌కారంతో మ‌రోసారి స‌భ్యుల‌కు అసోసియేష‌న్ ద్వారా మూడు సార్లు స‌రుకులు పంపిణీ చేసామ‌ని తెలిపారు. మ‌ర‌ణించిన క్రిటిక్స్ కుటుంబాల‌కు రూ.25 వేల చొప్పున సాయ‌మందించామ‌ని వెల్ల‌డించారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు.. శ‌ర‌త్ కుమార్..  రాజా (ఆసం).. బీఏ రాజు... సాంబ‌శివ రావు త‌దిత‌రుల కుటుంబాల‌కు ఈ సాయం అందింది. ఇక క్రిటిక్స్ గోల్డెన్ జూబ్లీ ఉత్స‌వాల‌ను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించేందుకు క్రిటిక్స్ స‌న్నాహాల్లో ఉన్నారు. ప్ర‌స్తుత క‌రోనా సందిగ్ధ‌త వ‌ల్ల ఇది అంత‌కంత‌కు వాయిదా ప‌డుతోంది.
Tags:    

Similar News