ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, స్టార్ హీరో మెగాస్టార్ గురువారం ప్రత్యేకంగా భేటీ కానున్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో చిరంజీవిని కలిసేందుకు సీఎం జగన్ ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇరువురు కలిసి లంచ్ చేయనున్నారు. ఏపీ టికెట్ రేట్ల తగ్గించడం, థియేటర్లని చాలా వరకు సీజ్ చేయడం వంటి కారణాల నేపథ్యంలో సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా భేటీ అవుతుండటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గత కొంత కాలంగా చిత్ర పరిశ్రమలో ఏపీలో ఎదుర్కొంటున్న సమస్యలపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. అంతే కాకుండా తగ్గించిన టికెట్ రేట్ల పై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. టికెట్ రేట్లతో పాటు సినీ వర్గాలు, వైసీపీ నాయకుల మధ్య రోజు రోజుకీ పెరుగుతున్న దూరాన్ని తగ్గించడంతో పాటు వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని మెగాస్టార్ భావిస్తున్నారట. ఇందులో భాగంగానే చిరు ఏపీ సీఎం జగన్ ని ప్రత్యేకంగా కలుస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితుల్ని, ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల్ని చిరంజీవి ఈ సందర్భంగా సీఎం జగన్ కు వివరించనున్నారట. అంతే కాకుండా సినీ పరిశ్రమతో పాటు అందులోని వ్యక్తులపై వైసీపీ నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలని కూడా చిరు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నారట. ఈ నేపథ్యంలో చిరుతో భేటీ తరువాత వైఎస్ జగన్ ఎలాంటి ప్రకటన ఇవ్వబోతున్నారా? అని అంతా ఆరాతీస్తున్నారు.
ఇదిలా వుంటే ఇప్పటికే వివాదాస్పద దర్శకుడు రామక్ష గోపాల్ వర్మ ఇటీవల టికెట్ రేట్ల సమస్యపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ భేటీ పెద్దగా ఉపయోగాపడలేదు. ఎలాంటి ముందడుగు పడకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగడం, సీఎం వైఎస్ జగన్ ఆయనతో భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పడు హాట్ టాపిక్ గామారింది.