మెగాస్టార్..మాస్ రాజా ఫ్యాన్స్ కి స్పెష‌ల్ ట్రీట్!

Update: 2022-10-28 15:30 GMT
మెగాస్టార్ చిరంజీవి # 154వ చిత్రం 'వాల్తేరు వీర‌య్య' పై నెల‌కొన్న అంచనాలు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమా ప్రారంభానికి ముందే త‌న అభిమాన‌మంతా సినిమాపై చూపిస్తాన‌ని ద‌ర్శ‌కుడు బాబి ప్రామిస్ చేసాడు. అదే మాట‌ను నేటికి చెప్పుకుంటూ వ‌స్తున్నాడు. ఇటీవ‌లే చిరంజీవి  మాస్ లుక్ రివీల్ చేసి ఫ్యాన్స్ లో అంచ‌నాలు అంత‌కంత‌కు పెంచేసారు.

టీజ‌ర్ ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. మ‌రో రిక్షావోడు టైప్ లో మెగాస్టార్ ని ప్ర‌జెంట్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇక సినిమాలో మెగాస్టార్ సోద‌రుడి పాత్ర‌లో మాస్ రాజా ర‌వితేజ న‌టిచ‌డం మ‌రోఎత్తు. రెండు పాత్ర‌లు తెర‌పై ఆద్యంతం ఆక‌ట్టుకుంటాయ‌ని ధీమా క‌నిపిస్తోంది.  వాటిని వైవిథ్య‌మైన కోణంలో బాబి ఆవిష్క‌రిస్తున్నారు. ర‌వితేజ పాత్ర కాస్త‌కి నెగిటివ్ ట‌చ్ అప్ ఇస్తున్న‌ట్లు స‌మాచారం. ఇంకా సినిమాలో స్పెష‌ల్స్ అన్ని ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వస్తున్నాయి.

ఇటీవ‌లే చిరంజీవి.. రవితేజలపై ఓ మాస్ సాంగ్ చిత్రీకరణను పూర్తి చేశారు. దేవి శ్రీ ప్ర‌సాద్ కంపోజ్ చేసిన ఆ పాట‌కి ఇద్ద‌రు మాస్ స్టెప్పుల‌తో అద‌గొట్టిన‌ట్లు లీకైంది. సినిమాలో ఈ పాట ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుందని..ఫ్యాన్స్ తో విజుల్స్ వేయిస్తుదంటున్నారు.  చిరు - రవితేజ ఇద్దరూ అద్భుతమైన డ్యాన్స్‌లు.  వారిద్ద‌రు కలిసి లైవ్లీ ట్రాక్‌లో డ్యాన్స్ చేయడం అభిమానుల‌కు స్పెష‌ల్  ట్రీట్‌గా ఉంటుందంటున్నారు.

అలాగే దేవి శ్రీ ప్రసాద్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అందించిన‌ట్లు తెలుస్తుంది. సినిమాలో ఎన్ని పాట‌లున్నా..అన్న‌య్య‌పై అభిమానంతో ఈపాట ని ప్ర‌త్యేకంగా కంపోజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది.  ఈ పాట‌కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. మొత్తానికి వాల్తేరు వీర‌య్య‌లో  మాస్ అభిమానులు ఏమాత్రం  నిరుత్సాహ ప‌ర‌చ‌కుండా  అదిరిపోయే సాంగ్ ఒక‌టి ప్లాన్ చేసిన‌ట్టు క‌నిపిస్తుంది.

మ‌రి ఆ పాట‌ని బాబి అండ్ కో ఎలా చిత్రీక‌రించారు అన్న‌ది తెలియాలి.  ఇక అప్ డేట్ విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్త‌యింది. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న సినిమా కావ‌డంతో వీలైనంత వేగంగా అన్ని ప‌నులు పూర్తిచేసి డిసెంబ‌ర్ క‌ల్లా రెడీగా ఉండాల‌ని భావిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News