పూరి మంచి ట్రావెల్ ప్రియుడు. ప్రపంచాన్ని చుట్టేయడం అంటే? ఆయనకి ఎంతో ఇష్టం. ఖాళీ సమయం చిక్కితే పూరి చేసే పని అదే. రెక్కలుంటే పక్షిలా ఎగిరిపోయేవాడిని అంటాడు. అందుకే మరోజన్మ అంటూ ఉంటే ఎగిరే పక్షిలా పుట్టాలంటుంటాడు. అందుకే కలిసి ప్రయాణం చేయాలంటే? పూరి నే ఛాయిస్ గా తీసుకుంటామని చాలా మంది సహచరులు చెప్పే మాట.
వి.వి. వినాయక్ అయితే పూరిని ఎంతగా అభిమానిస్తారో? చెప్పాల్సిన పనిలేదు. బ్రతికినంత కాలం పూరిలాగే బ్రతకాలంటారు. ప్రపంచంలో అతనంత స్వేచ్ఛా జీవి మరొకరుండరంటారు. అందుకే పూరితో జర్నీని వినాయక్ అంతగా ఇష్టపడుతుంటారు. మరి మెగాస్టార్ చిరంజీవి సైతం పూరిని అంతగా లైక్ చేస్తారా? అంటే అవుననే తెలుస్తోంది.
ఓ రోజు పూరి ఆఫీస్ కి నేరుగా చిరంజీవి ఓ చిన్న కారులోనే వచ్చారు. ఆ సమయంలో పూరి ఏదో పనిలో ఉన్నాడు. చిరంజీవి తన ఆఫీస్ కి రావడం చూసి పూరి షాక్ అయ్యారు. ఏంటి సార్ మీరిలా వచ్చారు? అని అడిగారు. దానికి చిరంజీవి బీజీగా ఉన్నావా? ఫ్రీగా ఉన్నావా? అని అడిగారు. పూరి ఖాళీగానే ఉన్నాను అనడంతో అయితే పద బయటకు వెళ్దాం అని అదే చిన్న కారులో పూరిని ఎక్కించారు చిరు.
మెగాస్టార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చోగా..పూరి అతని పక్కనే కూర్చున్నారు. ఎక్కడికి వెళ్దాం అని చిరంజీవి అడగగా...పూరికి వెంటనే తట్టలేదు. దీంతో చిరంజీవి కారు యూటర్న్ తిప్పి మాదాపూర్ గల్లీ వెంట బండి మళ్లీంచారు. అప్పటికి మాదాపూర్ అంతా డెవలప్ ఏరియా కాదు. అంతా ఖాళీ ప్రదేశమే. కారు లో వెళ్తుండగా చిరంజీవి పూరితో పాన్ వేయాలని ఉందయ్యా? అన్నారు.
అల్లాంత దూరంలో పాన్ షాప్ కనిపించే సరికి చిరు కారు నేరుగా అక్కడికి వెళ్లి ఆగింది. అక్కడ ఆ పాన్ షాప్..అందులో ఓ కుర్రాడు తప్ప ఎవరూ లేరు. కారులో ఉన్న చిరంజీవిని చూసి ఆ కుర్రాడు ఎంతో సంతోషించాడు. డోర్ వద్దకు వచ్చి ఏం కావాలి సార్ అన్నాడు. చిరు మంచి పాన్ కట్టు అన్నారు. ఆ సమయంలో ఆ కుర్ఆరడు తమలపాకుని నీళ్లతో కడుగుతూ మెగాస్టార్ మెగాస్టార్ అంటూ బిగ్గరగా అరిచాడు.
కానీ అక్కడ కనుచూప మేర ఒక్కరు కూడా లేరు. చిరంజీవిని చూసాను అని తన ఆనందాన్ని పంచుకోవడం కోసమే అంతలా కేకలు పెట్టాడు. కానీ ఎవరూ లేకపోయే సరికి ఆ సంతోషాన్ని ఆ క్షణంలో ఎవరితో పంచుకోలేపోయాడు. తన పాన్ షాప్ ముందు చిరంజీవి కారు వచ్చి ఆగిందని చెబితే ఎవరూ నమ్మరు.కానీ ఇది నిజం. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను. చిరంజీవి పాన్ కి డబ్బులు ఇవ్వబోదుంటే? వద్దన్నాడు. కానీ 200 బలవంతంగా ఇచ్చారు. ఈ వీడియోను ఆ కుర్రాడు చూడాలని కోరుకుంటున్నాను. అతని దృష్టికి ఈ వీడియో వెళ్తే ఎంతో సంతోషిస్తాడు అని" పూరి ఈ వీడియో రిలీజ్ చేసారు.Full View
వి.వి. వినాయక్ అయితే పూరిని ఎంతగా అభిమానిస్తారో? చెప్పాల్సిన పనిలేదు. బ్రతికినంత కాలం పూరిలాగే బ్రతకాలంటారు. ప్రపంచంలో అతనంత స్వేచ్ఛా జీవి మరొకరుండరంటారు. అందుకే పూరితో జర్నీని వినాయక్ అంతగా ఇష్టపడుతుంటారు. మరి మెగాస్టార్ చిరంజీవి సైతం పూరిని అంతగా లైక్ చేస్తారా? అంటే అవుననే తెలుస్తోంది.
ఓ రోజు పూరి ఆఫీస్ కి నేరుగా చిరంజీవి ఓ చిన్న కారులోనే వచ్చారు. ఆ సమయంలో పూరి ఏదో పనిలో ఉన్నాడు. చిరంజీవి తన ఆఫీస్ కి రావడం చూసి పూరి షాక్ అయ్యారు. ఏంటి సార్ మీరిలా వచ్చారు? అని అడిగారు. దానికి చిరంజీవి బీజీగా ఉన్నావా? ఫ్రీగా ఉన్నావా? అని అడిగారు. పూరి ఖాళీగానే ఉన్నాను అనడంతో అయితే పద బయటకు వెళ్దాం అని అదే చిన్న కారులో పూరిని ఎక్కించారు చిరు.
మెగాస్టార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చోగా..పూరి అతని పక్కనే కూర్చున్నారు. ఎక్కడికి వెళ్దాం అని చిరంజీవి అడగగా...పూరికి వెంటనే తట్టలేదు. దీంతో చిరంజీవి కారు యూటర్న్ తిప్పి మాదాపూర్ గల్లీ వెంట బండి మళ్లీంచారు. అప్పటికి మాదాపూర్ అంతా డెవలప్ ఏరియా కాదు. అంతా ఖాళీ ప్రదేశమే. కారు లో వెళ్తుండగా చిరంజీవి పూరితో పాన్ వేయాలని ఉందయ్యా? అన్నారు.
అల్లాంత దూరంలో పాన్ షాప్ కనిపించే సరికి చిరు కారు నేరుగా అక్కడికి వెళ్లి ఆగింది. అక్కడ ఆ పాన్ షాప్..అందులో ఓ కుర్రాడు తప్ప ఎవరూ లేరు. కారులో ఉన్న చిరంజీవిని చూసి ఆ కుర్రాడు ఎంతో సంతోషించాడు. డోర్ వద్దకు వచ్చి ఏం కావాలి సార్ అన్నాడు. చిరు మంచి పాన్ కట్టు అన్నారు. ఆ సమయంలో ఆ కుర్ఆరడు తమలపాకుని నీళ్లతో కడుగుతూ మెగాస్టార్ మెగాస్టార్ అంటూ బిగ్గరగా అరిచాడు.
కానీ అక్కడ కనుచూప మేర ఒక్కరు కూడా లేరు. చిరంజీవిని చూసాను అని తన ఆనందాన్ని పంచుకోవడం కోసమే అంతలా కేకలు పెట్టాడు. కానీ ఎవరూ లేకపోయే సరికి ఆ సంతోషాన్ని ఆ క్షణంలో ఎవరితో పంచుకోలేపోయాడు. తన పాన్ షాప్ ముందు చిరంజీవి కారు వచ్చి ఆగిందని చెబితే ఎవరూ నమ్మరు.కానీ ఇది నిజం. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను. చిరంజీవి పాన్ కి డబ్బులు ఇవ్వబోదుంటే? వద్దన్నాడు. కానీ 200 బలవంతంగా ఇచ్చారు. ఈ వీడియోను ఆ కుర్రాడు చూడాలని కోరుకుంటున్నాను. అతని దృష్టికి ఈ వీడియో వెళ్తే ఎంతో సంతోషిస్తాడు అని" పూరి ఈ వీడియో రిలీజ్ చేసారు.