‘ఛల్ మోహనరంగ’ సినిమా ట్రైలర్ చూసిన వాళ్లందరికీ... హీరోయిన్ మేఘా ఆకాష్ ఒక సీన్లో నితిన్ ను వీపు మీద ఎక్కించుకోవడం తెలిసే ఉంటుంది. పిల్ల చూస్తే బక్కగుంది. మనోడేమో భారీ సైజులో ఉన్నాడు. ఎనిమిది పలకల బాడీని చేసిన చరిత్ర కూడా ఉంది. అలాంటి నితిన్ ను మేఘా ఆకాష్ ఎలా ఎత్తుకుందబ్బా... అనే సందేహం కలిగే ఉంటుంది.
అమ్మడికి కూడా ఈ సీన్ చేయడం... మనకు కనిపిస్తున్నంత ఈజీగా ఏం అవ్వలేదట. ఈ విషయం గురించే అడిగితే... ‘‘నితిన్ చాలా బరువుంటాడు. అతన్ని మోయడం చాలా కష్టమైన పనే. అందులోనూ ఆ సీన్లో నేను హై హీల్స్ వేసుకుని ఉన్నా... ఒక్కసారి ఆలోచించండి నా పరిస్థితి. హై హీల్స్ ను బ్యాలెన్స్ చేస్తూ... అంత బరువున్న నితిన్ ను మోయడం. అయినా దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సీన్ చెప్పినప్పుడు చేయలేనని చెప్పలేదు. అలా చెప్పడం భావ్యం కాదనిపించింది. అందుకే ఎంత కష్టమైనా... నితిన్ నే భుజం మీద మోసేశా! ’’ అంటూ చెబుతూ... నవ్వేసింది మేఘా ఆకాష్.
ఈ సీన్ చూసిన వారందరికీ ‘మిర్చి’ సినిమాయే గుర్తొస్తోంది. ఆ సినిమాలో మామిడి పండు అందక ఎగురుతున్న ప్రభాస్ ను... వెనకి నుంచి వచ్చి ఒక్కసారి ఎత్తేస్తుంది అనుష్క శెట్టి. అయితే అక్కడ అనుష్కది కూడా భారీ ఖాయమే. కాబట్టి మోయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ బక్క పిల్ల మేఘా ఆకాష్... నితిన్ బరువును మోసిందంటే విశేషమే. రేపు విడుదలవుతున్న ‘ఛల్ మోహనరంగ’ మేఘా ఆకాష్‌కి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.