మెగా అల్లుడితో మేఘా

Update: 2018-04-09 10:10 GMT
‘గా’ కాదు ఒత్తు ‘ఘా’ అంటూ నితిన్ ని ఆటపట్టించే పాత్రతో ఇటీవలే చల్ మోహనరంగలో అల్లరి చేసిన హీరొయిన్ మేఘా ఆకాష్ కు అవకాశాలు మెల్లగా వెతుక్కుంటూ వస్తున్నాయి. మొదటి సినిమా 'లై' హీరో నితిన్ విలన్ అర్జున్ చుట్టే తిరిగే కథ కావడంతో తన నటనకు పెద్దగా స్కోప్ దక్కలేదు. పైగా లై ఆశించిన విజయం సాధించలేదు. కాని చల్ మోహన్ రంగాలో హీరోతో సమానంగా కథలో జర్నీ చేసే పాత్ర కావడంతో మేఘా మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఏది వస్తే ఆ ఆఫర్ ఒప్పుకోకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న మేఘా మెగా కాంపౌండ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తాజా సమాచారం.

వరస పరాజయాలతో షాక్ తిని కొత్త స్క్రిప్ట్స్ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్న సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ తో 'ఉన్నది ఒకటే జిందగీ'తో గత ఏడాది పర్వాలేదు అనిపించుకున్న దర్శకుడు తిరుమల కిషోర్ చేయబోయే మూవీకి హీరొయిన్ గా మేఘా ఆకాష్ పేరే ఉందని ఇన్ సైడ్ టాక్. నేను శైలజతో బ్లాక్ బస్టర్ కొట్టిన కిషోర్ తిరుమల ఆ స్థాయి మేజిక్ మళ్ళి రెండో సినిమాలో రిపీట్ చేయలేకపోయాడు. అందుకే సాయి ధరం తేజ్ ను ఇంప్రెస్ చేసే స్క్రిప్ట్ తో వర్క్ అవుట్ చేసినట్టు టాక్. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నట్టు తెలిసింది. తీసిన మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అయిన మైత్రి బ్యానర్ అంటే హీరో హీరొయిన్లు లక్కీగా ఫీలవుతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది కనక ఓకే అయితే ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్న సాయి ధరం తేజ్ కు దాని తర్వాత మూవీ ఇదే అవుతుంది
Tags:    

Similar News