ఆ ప్రశ్నని మహేష్ ఎక్స్‌ పెక్ట్ చేశాడ‌ట‌

Update: 2015-08-17 10:29 GMT
ఎప్పుడూ లేని రీతిలో త‌న సినిమాని ఎగ్రెసివ్‌ గా ప్ర‌మోట్ చేస్తున్నాడు మ‌హేష్‌. ఇదివ‌ర‌కు త‌న సినిమా విడుద‌ల‌కు ముందు మీడియా ముందుకొచ్చి ఇంట‌ర్వ్యూ లు ఇవ్వ‌డానికి కూడా మ‌హేష్ త‌ట‌ప‌టాయించేవాడు. నా కంటే నా సినిమానే మాట్లాడుతుంద‌న్న‌ట్టు  వ్య‌వ‌హ‌రించేవాడు. కానీ `శ్రీమంతుడు`ని మాత్రం క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ప్ర‌మోట్ చేస్తున్నాడు మ‌హేష్‌. సినిమా విడుద‌ల‌కు ముందు ఒక ద‌ఫా ఇంట‌ర్వ్యూ లు ఇచ్చాడు,  విడుద‌ల‌య్యాక మ‌ళ్లీ ఓ ద‌ఫా మీడియాతో ఇంట‌రాక్ట్ అయ్యాడు. ఎఫ్‌.ఎమ్‌. స్టేష‌న్ లు, టీవీ ఛానళ్లు... అబ్బో ఎక్క‌డ చూసినా `శ్రీమంతుడు` క‌బుర్లే. మ‌హేష్ భార్య న‌మ్ర‌త కూడా రంగంలోకి దిగి ప్ర‌మోష‌న్ వ్య‌వ‌హారాల్ని చూసుకొంటోంది.  ఇదంతా చూస్తున్న ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. సినిమాకి మ‌హేష్ ఓ నిర్మాత కావ‌డంతోనే అంత అగ్రెసివ్‌ గా ప్ర‌మోట్ చేస్తున్నాడ‌ని మాట్లాడుకొంటున్నారు. అదే సందేహాన్ని మీడియా కూడా మ‌హేష్ ముందు వ్య‌క్తం చేసింది.

 `మీరు నిర్మాత కావ‌డంతోనే ఇంత‌గా ప్ర‌మోట్ చేస్తున్నారా?` అని మీడియా ప్ర‌తినిధులు మ‌హేష్‌ ని అడిగితే... మీరు ఈ ప్ర‌శ్న అడుగుతార‌ని నాకు తెలుసు అంటూ త‌న‌దైన శైలిలో  స‌మాధాన‌మిచ్చాడు మ‌హేష్‌. ``ఏ సినిమాకైనా ప్ర‌మోష‌న్ చాలా ముఖ్యం. `శ్రీమంతుడు`లాంటి సినిమాల‌కైతే  ఇంకా ముఖ్యం. కాన్సెప్ట్‌ ని ప్రేక్ష‌కు ల్లోకి తీసుకెళ్లాలి. సోష‌ల్ ఎలిమెంట్ ఆధారంగా రూపొందిన క‌థ కాబ‌ట్టి ఆ కాన్సెప్ట్ ప్రేక్ష‌కుల‌కు చేరువ కావాల‌నే ఇలా ప్రమోట్ చేస్తున్నా`` అని చెప్పుకొచ్చాడు మ‌హేష్‌. ఆగ‌స్టు 15, ఆదివారం క‌లిసిరావ‌డంతో `శ్రీమంతుడు`కి మ‌రో బ‌ల‌మైన వీకెండ్ వ‌చ్చిన‌ట్ట‌యింది. అందుకే మ‌హేష్ ఆ రెండు రోజుల‌పై బాగా కాన్సంట్రేట్ చేసి సినిమాని ప్ర‌మోట్ చేశాడు. `కిక్‌2` వ‌చ్చే వ‌ర‌కు `శ్రీమంతుడు`దే సంద‌డి. ఇప్ప‌టికే లాభాల బాట ప‌ట్టిన శ్రీమంతుడుకి ఇప్పుడు ప్ర‌మోష‌న్ కూడా తోడ‌వ‌డంతో రాబోయే రెండు వారాల్లో మ‌రిన్ని లాభాలు కూడ‌గ‌ట్టుకొంటుంద‌ని అంచనా వేస్తున్నారు. మొత్త‌మ్మీద మ‌హేష్ హీరోగా, నిర్మాతగా సూప‌ర్‌హిట్ట‌య్యాడు.
Tags:    

Similar News