ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ హీరోకైనా హీరొయిన్ కైనా అభిమానులను అదే పనిగా గుర్తుంచుకోవడం జరగని పని. అలా జరగాలి అంటే దానికి చాలా ప్రత్యేకమైన కారణం ఉండాలి. అందుకే ఫ్యాన్స్ తమను తారలు మర్చిపోకుండా ఉండేందుకు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. గుడి కట్టే వాళ్ళు కొందరైతే పాలాభిషేకాలు చేసేవాళ్ళు మరికొందరు. కాని ఒక నెల్లూరు మెహ్రీన్ అభిమాని మాత్రం తాను చాలా చాలా స్పెషల్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఓ షో రూమ్ ఓపెనింగ్ కోసం ఇటీవలే అక్కడికి వెళ్ళిన మెహ్రీన్ ను స్థానికంగా ఉండే ఒక అభిమాని కలిసి తన మెడ వెనుక భాగం కింద తనకిష్టమైన హీరొయిన్ పేరుని ఇంగ్లీష్ అక్షరాల్లో పచ్చ పొడిపించుకుని అక్కడికి వచ్చి చూపించాడు. సాధారణంగా ఇలాంటివి చూసినప్పుడు స్టార్ల రియాక్షన్ వేరుగా ఉంటుంది. ఇలాంటివి చేయకండి అని వారిస్తారు.
కాని మెహ్రీన్ రూటే సెపరేటు. ఆనందంతో ఉబ్బితబిబ్బు అయిపోయి అతని టాటూని ఫోటో తీసుకుని గర్వంగా షేర్ చేసుకుంది. సదరు అభిమానికి వెంటనే సెల్ఫీ కూడా సాంక్షన్ చేసేసింది. ఇక అతని ఆనందం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాలా. అంతా బాగానే ఉంది కాని ఇలా పచ్చ పొడుచుకుని వచ్చిన అభిమానిని మెహ్రీన్ చిన్న మాట కూడా అనకపోవడం గమనార్హం. యువతలో ఉండే దుడుకుతనం వల్ల వాళ్ళు ఇలాంటివి చేయటం సహజమే కాని వాటిని అవకాశం సందర్భం వచ్చినప్పుడు వారించడం చాలా అవసరం. ఇప్పుడు మెచ్చుకుంది కదా రేపు అదే అభిమాని ఛాతి మీదనో లేక నుదుటి మీదనో అదే ప్రయత్నం చేస్తే ఎంత రిస్క్ అనేది ఆలోచించాలి. అభిమానం వెర్రి తలలు వేస్తున్నప్పుడు అది మన దాకా వచ్చినప్పుడు జాగ్రత్త చెప్పడంలో తప్పు లేదు. లేదు మెచ్చుకున్నామని దీన్ని స్పూర్తిగా తీసుకుని ఇంకొందరు తయారవుతారు కాదంటారా.