2018లో 'సుబ్రమణ్యపురం' అనే థ్రిల్లర్ మూవితో దర్శకుడుగా పరిచయమయ్యాడు సంతోష్ జాగర్లమూడి. ఇక ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ దర్శకత్వంలో రెండో సినిమాను ఏషియన్ సినిమాస్ వారు నారాయణదాసు నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్ రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎప్పుడో గతంలో సినిమా ప్రారంభంలో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, మరో ప్రొడ్యూసర్ దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సన్నివేశాన్ని దేవుడి చిత్రపటాలపై చిత్రీకరించారు దర్శకుడు సంతోష్ జాగర్లమూడి. ఆ తర్వాత మళ్లీ మొన్నటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి ఊసు లేదు. అయితే నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న 20వ సినిమా ఇది. ఈ సినిమా అతనికి ఎంతో ప్రత్యేకం అని పోస్టర్ కొత్తగా విడుదల చేసిన పోస్టర్ చూస్తేనే అర్ధమవుతుంది. ఇదివరకే ప్రొడ్యూసర్ శరత్ మాట్లాడుతూ.. ఇదొక స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథ అని అన్నారు. అలాగే సంతోష్ రాసిన కథ అద్భుతంగా ఉందని.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం చేస్తామని తెలిపారు.
డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. ఇదొక ఇమాజినరీ బయోపిక్ లా ఉండబోతుందని.. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగుతుందని చెప్పాడు. కానీ ఇటీవల విడుదల చేసిన పోస్టర్ చూస్తే ఓ ప్రాచీన యుద్ధ కళ నేపథ్యంలో సాగుతుందని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉండగా.. ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ప్రేక్షకులు ఏ ఒక్క మిస్టేక్ దొరికిన వదలడం లేదు. తాజాగా నాగశౌర్య పోస్టర్లో కండలు తిరిగి బాగానే కనిపించాడు. కానీ అతను ధరించిన అండర్వెర్ కనిపించకుండా ఎడిట్ చేయడం మర్చిపోయారంటూ మాట్లాడుకుంటున్నారు. అది ఫిలిప్ ప్లీన్ బ్రాండ్ అండర్వెర్ ధర 11వేల రూపాయలు ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. పోస్టర్ అంతబాగా సెట్ చేసుకొని ఒక్క అండర్వెర్ విషయంలో దొరికిపోయారని మీమ్స్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. అయితే. మరోసారి ఇలాంటి మిస్టేక్ చేయకుండా జాగ్రత్త పడాలని మీమ్స్ క్రియేట్ చేసినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు వారికి మద్దతు పలకడం విశేషం. చూడాలి మరి నాగశౌర్య టీమ్ ఏం చేయనుందో..!