సన్నిలియాన్.. ఏ మాత్రం పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఇప్పుడిదే పేరును కథాంశంగా తీసుకొని ఏకంగా ఒక యూట్యూబ్ ఫిలింను చుట్టేశారు రాంగోపాల్ వర్మ. గన్స్ అండ్ థైస్ పేరిట వెబ్ సిరీస్ ను స్టార్ట్ చేసిన వర్మ.. తన మొదటి వెబ్ ఫిలింలో హింసను.. శృంగారాన్ని విచ్చలవిడిగా చూపించేసిన వర్మ.. తాజాగా మరో చిత్రమైన కాన్సెప్ట్ తో వెబ్ ఫిలిం చేశారు.
మేరీ బేటీ సన్నీ లియాన్ బన్‌నా చాహ్ తీ హై (నా కూతురు సన్నీలియాన్ లా కావాలనుకుంటోంది) టైటిల్ తో షార్ట్ ఫిలింను రూపొందించారు వర్మ. ఇది ఈ శనివారం యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. యూట్యూబ్ లోఈ చిత్రం విడుదలైన నాలుగు గంటల లోపే.. ఏకంగా యాభై వేలకు పైగా హిట్స్ సాధించిన ఈ మూవీలో కథాంశం కాస్త భిన్నం.
సన్నీలియాన్ మాదిరి సెక్సువాలిటీయే పెట్టుబడిగా పెట్టేసి డబ్బు సంపాదించి జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్న ఒక యువతి.. తన మనసులోని మాటను తల్లిదండ్రుల ఎదుటే చెప్పేయటంతో పెద్ద బాంబే పేలుతుంది.
తనకు నచ్చినట్లుగా బతికేస్తానని చెప్పే అమ్మాయి.. అది సరైన మార్గం కాదని వారించి.. హెచ్చరించే తల్లిదండ్రుల నడుమ ఒక గదిలో చుట్టేసిన ఈ షార్ట్ ఫిలిం ఇప్పుడు సంచలనంగా మారింది. పరిమితమైన పాత్రలతో. ఒక గదిలో జరిగే సంభాషణలతో పదకొండున్నర నిమిషాల లఘు చిత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ షార్ట్ ఫిలింలో తన గత షార్ట్ ఫిలిం మాదిరి శృంగారం మీద ఫోకస్ చేయకుండా సంభాషణల మీద తన పైత్యం ప్రదర్శించినట్లుగా చెబుతున్నారు.
సన్నీలియాన్ కావాలనుకునే యువతి పాత్రలో నైనాగంగూలీ.. అదేనండి వంగవీటి ఫేం.. ఆమె తండ్రి పాత్రలో మకరంద్ దేశ్ పాండే దండుపాళ్యం ఫేం.. తల్లి పాత్రలో దివ్యా జగ్దలే నటించారు. ఆర్జీవీ టాకీస్ పతాకంపై రూపొందించిన ఈ ఫిలిం చూసిన వారిలో కొందరు.. వర్మ పర్వర్షన్ కాస్త శృతిమించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శల సంగతి తర్వాత.. నాలుగు గంటల వ్యవధిలో 50వేల హిట్స్ రావటం చూస్తే.. వర్మ తాను అనుకున్నది సాధిస్తున్నారని చెప్పక తప్పదు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/