దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్టు కొట్టడం గొప్ప అనుభూతి. మరి రెండో సినిమాతో ఇంకా పెద్ద విజయాన్నందుకుంటే ఇంకా మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడా ఫీలింగునే ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ. అతడి తొలి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ కంటే కూడా రెండో సినిమా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఇంకా పెద్ద హిట్టయింది. ఈ ఆనందంలో సంక్రాంతికి వచ్చిన మిగతా మూడు సినిమాల డైరెక్టర్లతో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన మేర్లపాక గాంధీ.. తన సినిమా విడుదలకు ముందు రోజు తానెంత టెన్షన్ పడింది వివరించాడు.
‘‘మా సినిమా రావడానికి ఒక రోజు ముందు సుకుమార్ గారి ‘నాన్నకు ప్రేమతో’ విడుదలైంది. నేను సుకుమార్ గారికి పెద్ద ఫ్యాన్. ఈ మధ్య ఆయన కథ - స్క్రీన్ ప్లే అందించి, నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ నాకు బాగా నచ్చింది. ఆయన సినిమాలన్నీ తప్పకుండా చూస్తా. నా ఫ్రెండ్స్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు వెళ్తూ నన్ను కూడా రమ్మన్నారు. కానీ నేను ‘నేను రానురా బాబూ. ఈ టెన్షన్ లో సుకుమార్ గారి సినిమా చూస్తే నా సినిమా నాకు నచ్చదు. నా సినిమా రిలీజయ్యాక కొంచెం ఆగి చూస్తాను’ అని చెప్పేశాను’’ అని వెల్లడించాడు గాంధీ. ఐతే ‘నాన్నకు ప్రేమతో’ సహా సంక్రాంతికి విడుదలైన మిగతా సినిమాలేవీ కూడా ఇంకా చూడలేదని.. ఇక వీలు చూసుకుని చూస్తానని చెప్పాడు గాంధీ. మిగతా ముగ్గరు డైరెక్టర్లు సుకుమార్ - శ్రీవాస్ - కళ్యాణ్ కృష్ణ కూడా సంక్రాంతికి వచ్చిన మిగతా మూడు సినిమాలు చూడలేదని చెప్పారు.