ఈ పండక్కి రిలీజవుతున్న నాలుగు సినిమాల్లో ఏది ఎక్స్ క్లూజివ్? అని ప్రశ్నిస్తే చాలా ఎక్కువ మంది అభిప్రాయం ఎక్స్ ప్రెస్ రాజానే స్పెషల్ అని చెబుతున్నారు. ఈ మూవీ ట్రైలర్ నుంచి ప్రతిదీ కొత్తగా ఉన్నాయన్న పాజిటివ్ టాక్ వినిపించింది. రన్ రాజా రన్ తర్వాత మరోసారి శర్వా హిట్ కొట్టేయడం ఖాయం అని అందరూ ఖాయంగా చెప్పేస్తున్నారు.
యూత్ లో ఈ మూవీ గురించి ఎక్కువగా డిస్కషన్ సాగుతోంది. ఆ నలుగురు హీరోల్లో శర్వానంద్ కి ఇమేజ్ సమస్య లేదు కాబట్టి కథని బతికిస్తూ సినిమా తీసేందుకు మేర్ల పాక గాంధీకి అవకాశం దొరుకుంతుంది. కాబట్టి ఆ సినిమా అయితేనే మజానిస్తుంది అని అంతా ఎనాలిసిస్‌లు మొదలుపెట్టారు. అనే అంటున్నారు కాబట్టి.. ఎవరు కొత్తగా తీశారో నమ్మలేకపోతున్నాం. సినిమా రిజల్టు తేడా వస్తే.. శర్వానంద్ కు ప్రూవ్ చేసుకోవడానికి మళ్లీ టైమ్ పట్టేస్తుంది. మన దర్శకుడు నిన్న మాట్లాడుతూ.. ప్రతి ఐదు నిమిషాలకో ట్విస్టు.. కొత్త కొత్త క్యారెక్టర్లు అన్నాడు. అంతేకాదు.. ధనరాజ్ తో 'ఇనుము' అనే క్యారెక్టర్ తో ఏకంగా మాటలు లేకుండా కామెడీ చేయించాడట. ఐరన్ మ్యాన్ అనే ఒకే ఒక్క సినిమాను చూసిన ధనరాజ్.. ఇనుములో ఓ హృదయం మొలిచెనే అనే పాటను తన కాలర్ ట్యూన్ గా పెట్టుకొని.. కనిపించిన చోటల్లా ఐరన్ ను కోసుకుపోతుంటాడట. సినిమా అంతా ఇదే కామెడీ. అంటే వినోదం సినిమాలో బ్రహ్మానందం టైపులో. ఒక్కొక్క క్యారెక్టర్ లో ఇలాంటి షేడ్లు చాల ఉన్నాయ్ అంటున్నాడు గాంధి. చూద్దాం మరి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.
ఇక్కడ శర్వానంద్ కు ఒక విషయం మాత్రం చాలా ఇంపార్టెంట్. మామూలుగా సోలోగా వచ్చి ఆ సినిమాతో యావరేజ్ అనిపించుకున్నా పర్లేదు కాని.. ఇంతమంది పెద్ద స్టార్ల మధ్యన వేలు పెట్టి సినిమా ఫ్లాప్ అనే టాక్ తెచ్చుకుంటే మాత్రం రచ్చ రంబోలా అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బస్టరే కొట్టాలి.