సైలెంట్‌ గా ఎక్స్‌ ప్రెస్ కాంబోలో మ‌రోటి

Update: 2018-07-20 07:55 GMT
నానితో కృష్ణార్జున యుద్ధం తీశాడు మేర్ల‌పాక గాంధీ. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. ఆ ఎఫెక్ట్  యువ ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీపై త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని... ఆయ‌న్నుంచి మ‌రో  సినిమా రావ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుందుని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు మాట్లాడుకున్నాయి. కానీ అంద‌రి అంచ‌నాల్ని త‌ల‌కిందులు చేయ‌బోతున్నాడు మేర్ల‌పాక. ఇప్ప‌టికే ఆయ‌న కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగిన‌ట్టు స‌మాచారం. త‌న‌కు ఇదివ‌ర‌కు `ఎక్స్‌ ప్రెస్ రాజా` తీసే అవకాశాన్నిచ్చిన యువీ క్రియేష‌న్స్‌లోనే - కొత్త చిత్రం చేయ‌బోతున్నాడు మేర్ల‌పాక గాంధీ.

యూర‌ ప్‌లో ట్రైల్ షూట్ కోసం  ఈ నెలాఖ‌రున మేర్ల‌పాక‌ - యువీ టీమ్ వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం. ఇంకా క్యాస్టింగ్‌ ని కూడా పూర్తి స్థాయిలో ఎంపిక చేసుకోలేదు. కానీ యూర‌ప్ వెళుతున్నారంటే ఏదో ఒక కొత్త ప్ర‌య‌త్నమే చేస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. మేర్ల‌పాక గాంధీలో మంచి ప్ర‌తిభగ‌ల ద‌ర్శ‌కుడు ఉన్నాడు. ఆయ‌న తీసిన మూడు చిత్రాల్లోనూ ఆ విష‌యం అర్థ‌మైంది. తొలి రెండు చిత్రాలు ఘ‌న‌విజ‌యాన్ని అందుకొన్నాయి. కృష్ణార్జున‌యుద్ధం కూడా ఫ‌స్ట్‌ హాఫ్ వ‌ర‌కు ఎక్స్‌ లెంట్ అనిపించేలా ఉంటుంది. ద్వితీయార్థ‌మే రొటీన్ అనిపించ‌డంతో ఆ చిత్రం స‌క్సెస్ కాలేదు. ఈసారి మాత్రం క‌చ్చితంగా హిట్టు కొట్టాల్సిందే అనే క‌సితో ఉన్నారు మేర్ల‌పాక. అస‌లు యువీ సంస్థ‌తో క‌లిసి ఆయ‌న తీయ‌బోయే చిత్రం ఎలా ఉంటుంది? అందులో హీరో హీరోయిన్లు ఎవ‌ర‌న్న‌ది మాత్రం ఇంకొన్నాళ్లు ఆగాకే తెలుస్తుంది.
Tags:    

Similar News