దిల్ రాజును టాలీవుడ్లో అందరూ జడ్జిమెంట్ కింగ్ అంటారు. కథల ఎంపికలో ఆయనకు తిరుగులేదన్న పేరుంది. ఐతే రాజుకు కథల విషయంలో ఉన్న టేస్టేంటన్నది అందరికీ తెలిసిందే కానీ.. ఆయనకు మ్యూజిక్ మీద కూడా మంచి గ్రిప్ ఉందని.. ఒక ప్రముఖ సంగీత దర్శకుడికి ట్యూన్ విషయంలోనూ ఆదేశాలిచ్చేంత విషయంలో ఆయనలో ఉందని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దిల్ రాజు బేనర్లో మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మిక్కీ జే మేయర్.. దిల్ రాజు మ్యూజిక్ టేస్ట్ గురించి ఓ ఆసక్తికర సంఘటన చెప్పాడు.
రాజు బేనర్లో మిక్కీ తొలిసారిగా చేసిన సినిమా ‘కొత్త బంగారు లోకం’. అందులోని పాటలన్నీ సూపర్ హిట్టే. ముఖ్యంగా ‘నేననీ.. నీవనీ’ అనే పాట అయితే సంగీత ప్రియుల మతి పొగొట్టింది. నిజానికి ముందు ఆ పాట ఆడియోలో ఉన్నట్లుగా లేదట. నేననీ నీవనీ అనేది అసలు పల్లవే కాదట. దానికంటే ముందు మరో రకంగా ఈ పాట పల్లవి మొదలవుతుందట. ఆ అదనపు ట్యూన్ విని దిల్ రాజు నో అన్నాడట. నేననీ నీవనీ.. అనే దగ్గర్నుంచి పాటను మొదలుపెట్టాలని.. ముందు వచ్చే లైన్లు తీసేయాలని మిక్కీకి చెప్పాడట. దిల్ రాజు చెప్పింది కాదనే ధైర్యం లేక సరే అన్నాడట మిక్కీ.
కానీ తాను ఎంతో ఇష్టపడి చేసిన అడిషనల్ ట్యూన్ ను తీసేయడంతో మిక్కీ చాలా ఫీలయ్యాడట. రెండు రోజుల పాటు తన మనసు మనసులోనే లేదని అన్నాడు మిక్కీ. కానీ దిల్ రాజు చెప్పిన ప్రకారం పాట కంపోజ్ చేస్తే.. దానికి అద్బుతమైన స్పందన వచ్చిందని.. ఆ తర్వాత ఆయన ఎందుకలా మార్పు చేయించారో తనకు అర్థమైందని.. ఆయనే కరెక్ట్ అనిపించిందని.. మనం అనుకున్నదే కరెక్ట్ కాదు అన్న అభిప్రాయం అప్పుడు తనలో బలపడిందని మిక్కీ వెల్లడించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/