బ్రహ్మోత్సవం విడుదల సమంయలో ఏం జరిగిందో గుర్తుండే ఉంటుంది. అంతకుముందు నెలలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫెయిల్యూర్ గురించి మహేష్ ఫ్యాన్స్ కామెంట్లు చేశారని.. ఈసారి పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చిపోయారు. ‘ఫ్లాపోత్సవం’ అని.. ‘డిజాస్టర్ స్టార్ మహేష్ బాబు’ అని.. ‘యాంట్ ఇన్ ద ప్యాంట్ డ్యాన్స్’.. అని ఇలా రకరకాల హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్విట్టర్లో ఓ రేంజిలో ట్రోల్ చేశారు. టాలీవుడ్లో యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్స్ హద్దులు దాటిపోయింది ఆ టైంలోనే. అప్పట్నుంచి అభిమానులు పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడం తీవ్రమైంది. ఐతే ఈ ట్రోలింగ్ విషయంలో మహేష్ బాబు ఎలా ఫీలయ్యాడో ఏంటో కానీ.. ‘బ్రహ్మోత్సవం’ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ మాత్రం చాలా బాధపడ్డట్లున్నాడు.
అప్పటి ట్రోలింగ్ తననెంతో బాధించిందంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయం చెప్పాడు మిక్కీ. నిజానికి మహేష్ బాబు.. శ్రీకాంత్ అడ్డాల ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించాలని.. ‘బ్రహ్మోత్సవం’ ద్వారా మంచి చెప్పాలని తపించారని.. కానీ వాళ్లు ఆశించిన ప్రయోజనం నెరవేరలేదని అతనన్నాడు. సినిమా జయాపజయాలు ఎవరి చేతుల్లోనూ ఉండవని.. కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు వస్తాయని.. కానీ సినిమా ఫ్లాప్ అయితే అదే పనిగా టార్గెట్ చేసి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అతనన్నాడు. మహేష్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం తననెంతో బాధించిందని అతను చెప్పాడు. అందరూ కుటుంబం లాగా కలిసి ఉండాలని.. మంచే కోరుకోవాలని అతను సూచించాడు. మరి మిక్కీ చెప్పిన మంచి మాటల్ని స్టార్ హీరోల ఫ్యాన్స్ పట్టించుకుంటారా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/