మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల తీయనున్న మూవీకి.. పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే హీరోయిన్ సెలక్షన్ కి సంబంధించి ఓ డెసిషన్ కి వచ్చినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ - కాజల్ అగర్వాల్ లపై టెస్ట్ షూట్ కూడా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీకి సంగీత దర్శకుడిని కూడా సెలెక్ట్ చేసేసుకున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల.
సంగీత దర్శకుల్లో యంగ్ తరంగ్ అయిన మిక్కీ జే మేయర్ కు వరుణ్ తేజ్ మూవీకి సంబంధించిన మ్యూజిక్ బాధ్యతలు అప్పగిస్తున్నాడు వైట్ల. ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న మిక్కీ చేతికి ఈ ఆఫర్ రావడం కంటే.. పెద్ద విషయం మరొకటి ఉంది. అదే.. తమన్ ని కాదని.. వైట్ల డెసిషన్ తీసుకోవడం. దూకుడు నుంచి వరుసగా శ్రీను వైట్ల సినిమాలకు ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. దూకుడు - బాద్ షా - ఆగడు - బ్రూస్ లీ.. ఇలా హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా థమన్ చేతికే సినిమాలు వెళ్లాయి. అలాగే.. వైట్ల సినిమాల్లో రీసెంట్ ఫ్లాప్ అయిన బ్రూస్ లీకి కూడా.. థమన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్బ్ అనే చెప్పాలి.
మ్యూజిక్ పరంగా థమన్ తో ఎలాంటి డిఫరెన్సులు లేకపోయినా.. పాత మూసలో కాకుండా కొత్తగా ట్రై చేసేందుకే వైట్ల ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడని అంటున్నారు. పరిస్థితులు ఏవైనా.. మెగా క్యాంప్ నుంచి ఓ మంచి ఆఫర్ తమన్ చేజారి మిక్కీ జే మేయర్ అకౌంట్ లోకి వెళ్లిపోయింది.